AP: ఢిల్లీ పర్యటనలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

AP: ఢిల్లీ పర్యటనలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
X

సై­న్స్‌ ఎక్స్‌­పో­జ­ర్‌ టూ­ర్‌­లో భా­గం­గా ఏపీ­లో­ని ప్ర­భు­త్వ పా­ఠ­శా­ల­ల­కు చెం­దిన 52 మంది వి­ద్యా­ర్థు­లు ఢి­ల్లీ­లో పర్య­టి­స్తు­న్నా­రు. ఈ కా­ర్య­క్ర­మం కోసం జి­ల్లా­కు ఇద్ద­రు చొ­ప్పున 52 మంది వి­ద్యా­ర్థు­ల­ను అధి­కా­రు­లు ఎం­పిక చే­శా­రు. సమ­గ్ర శి­క్ష అభి­యా­న్‌, ఏపీ సై­న్స్‌ సిటీ వి­భా­గాల ఆధ్వ­ర్యం­లో వి­ద్యా­ర్థు­లు ది­ల్లీ వె­ళ్లా­రు. తొలి రోజు ఘజి­యా­బా­ద్‌­లో­ని కై­ట్‌ ఇం­జి­నీ­రిం­గ్‌ కా­లే­జీ­లో రా­కె­ట్‌ పరి­జ్ఞా­నం­పై ని­ర్వ­హిం­చిన అవ­గా­హన కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­న్నా­రు. రా­కె­ట్‌ పని­తీ­రు, తయా­రీ తది­తర వి­ష­యా­ల­ను నే­ర్చు­కు­నేం­దు­కు ఉన్న అం­శా­ల­పై వి­ద్యా­ర్థు­ల­కు కై­ట్‌ ఇం­జి­నీ­రిం­గ్‌ కా­లే­జీ అధ్యా­ప­కు­లు ప్ర­త్యేక శి­క్షణ ఇస్తు­న్నా­రు. పౌర వి­మా­న­యాన శాఖ మం­త్రి రా­మ్మో­హ­న్‌­నా­యు­డు­తో ఈ వి­ద్యా­ర్థు­లు భేటీ అయ్యా­రు. నేడు ఢి­ల్లీ­లో­ని రష్య­న్‌ కల్చ­ర్‌ సెం­ట­ర్‌­కు వె­ళ్ల­ను­న్నా­రు. అక్కడ భా­ర­త్‌-రష్యా స్పే­స్‌ సం­బం­ధా­లు, స్పు­త్ని­క్‌ తయా­రీ వంటి అం­శా­ల­ను రష్యా అధి­కా­రు­లు వి­ద్యా­ర్థు­ల­కు వి­వ­రి­స్తా­రు. శని­వా­రం జా­తీయ సై­న్స్‌ మ్యూ­జి­యం, రా­కె­ట్‌ వర్క్‌­షా­ప్‌, మో­డ­ల్‌ రా­కె­ట్‌ తయా­రీ, నె­హ్రూ ప్లా­ని­టో­రి­యం, ప్ర­ధా­ని సం­గ్ర­హా­ల­యా­న్ని సం­ద­ర్శిం­చ­ను­న్నా­రు.

Tags

Next Story