AP : ఒకేసారి 96 మంది డీఎస్పీల ట్రాన్స్‌ఫర్

AP : ఒకేసారి 96 మంది డీఎస్పీల ట్రాన్స్‌ఫర్
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి 96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. వైసీపీతో అంటకాగిన పలువురు డీఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్ లు ఇవ్వలేదు. వారందరినీ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని డీజీపీ ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా 96మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 57 మంది డీఎస్పీలను హెడ్ క్వార్టర్స్ కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. బదిలీ అయినవారిలో సీఐడీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ పాటు ఇతర విభాగాల అధికారులు ఉన్నారు.

Tags

Next Story