AP : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం .. నాయీ బ్రాహ్మణుల కమీషన్ పెంపు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో నాయీ బ్రాహ్మణులకు కనీస కమీషన్‌ను రూ.20వేల నుంచి రూ.25వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 6ఏ కేటగిరీలోని 44 దేవాలయాల్లో పనిచేస్తున్న వారికి వర్తించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. కనీసం ఆలయాల్లో 100 రోజుల పాటు సేవలు అందించేవారికి ఈ పెంపు వర్తించనుంది. ఏడాదికి రూ.50లక్షల నుంచి రూ.2 కోట్లు ఆదాయం వచ్చే ఆలయాలు 6A కేటగిరీలోకి వస్తాయి.
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రహ్మణులకు ఇప్పటి వరకు కనీస కమీషన్ రూ.20 వేలు ఉండగా.. దాన్ని మరో రూ.5 వేలు పెంచుతామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. ఇటీవల దేవాదాయ శాఖపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ హామీని అమలు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఏటా 100 రోజులకుపైగా కేశఖండన విధులుండే 44 ప్రధాన ఆలయాల్లోని నాయీబ్రాహ్మణులకు కనీస కమీషన్ రూ.25 వేలుకు పెంచుతూ దేవాదాయశాఖ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com