AP GOVT : బోడికొండగా రుషికొండ

విశాఖలోని రుషికొండను బోడికొండగా మార్చేసిన ప్రభుత్వం ఇప్పుడు దానిని కవర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. జర్మన్ టెక్నాలజీతో..బోడికొండను జియోమ్యాటింగ్‌తో కవర్ చేసేందుకు ప్రభుత్వం తంటాలు పడుతోంది. రుషికొండపై గ్రీన్ మ్యాట్ వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చే నెలలో జరగనున్న జి-20 సదస్సుకు అంతా ఆకుపచ్చగా కనిపించేలా జియో మేటింగ్ చేసినట్లు సమాచారం.
రుషికొండలో తవ్వకాలు జరపడాన్ని పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. న్యాయస్థానాల్లో కేసులు వేశారు. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల కంటే ఎక్కువగా కొండను తొలచిందని..దీనిపై గూగుల్ మ్యాప్‌లు సమర్పించాలని కోర్టులో అభ్యర్థనలున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఏడాదిన్నరగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటివరకు అక్కడ ఏం కడతారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రెండు నెలల క్రితమే ప్రయోగాత్మకంగా జియో మ్యాటింగ్ చేశామన్న అధికారులు..సత్ఫలితాలు ఇవ్వడంతోనే మిగిలిన ప్రాంతమంతా విస్తరిస్తున్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com