క్రైమ్‌కు కేరాఫ్‌ గా మారిన ఏపీ

క్రైమ్‌కు కేరాఫ్‌ గా మారిన ఏపీ
అరాచక శక్తులకు అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

క్రైమ్‌కు కేరాఫ్‌ గా ఏపీ మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో నిత్యం ఏదో చోట దాడులు..దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అరాచక శక్తులకు అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.మహిళలు,చిన్నారులు,దళితులు,సామాన్యులపై ఏదో మూల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ అరాచకాలను ప్రశ్నిస్తే భౌతికదాడులు,హత్యలకు కూడా తెగబడుతున్నారు. ఇన్ని అరాచకాలు రాష్ట్రంలో జరుగుతున్నా ప్రభుత్వాధినేత మాత్రం స్పందించడం లేదు.ఇటు పోలీసులు కూడా సర్కార్‌కు వత్తాసు పలుకుతూ సైలెంట్‌ అయ్యారన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో సామాన్యులకు దేవుడే దిక్కు అన్న పరిస్థితి నెలకొంది.

ఇక జగన్‌ పాలనలో దళిత యువకులకు పోలీసు స్టేషన్‌లోనే శిరోముండనం,లాక్‌ప్‌డెత్‌ వంటి దారుణాలు చోటు చేసుకున్నాయి.తమను ప్రశ్నించేవారిపై,ప్రతిపక్షాల విషయంలో పోలీసు వ్యవస్థను అధికార పార్టీ ఎలా వాడుకుంటుందో అందరికి తెలిసిందే ఇక అధికార పార్టీ నేతలు,వారి అనుచరులూ కూడా అదే దారిలో పయనిస్తూ పేట్రేగిపోతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నారు. సీఎం జగన్‌ సైలెంట్‌గా ఉంబటంతో పోలీసులు కూడా మౌనంగానే ఉండిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి.ఇదే అదనుగా అధికార పార్టీ నేతలు,కార్యకర్తలు రెచ్చిపోతున్నారు.దీంతో ఏపీ క్రైమ్‌ కి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందన్న విమర్శలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి సాక్షత్తూ కేంద్ర హోం మంత్రి కూడా అరాచకాలకు అడ్డాగా మారిందని కామెంట్‌ చేయడం చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది.రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగైపోతున్నాయి. దౌర్జన్యాలు, భౌతికదాడులు, హత్యలు, అరాచకాలకు లెక్కే లేదు. కన్నుపడిందంటే భూములు, గనులు, ఆస్తులు వారి స్వాధీనం కావాల్సిందే అన్నట్లుగా మారిపోయాయి.

బాపట్ల జిల్లా ఉప్పాలవారిపాలేనికి చెందిన అమర్నాథ్‌ అనే విద్యార్థిని అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డి సజీవదహనం చేశాడు. తన సోదరిని వేధించవద్దని అన్నందుకు ఇంతటి దురాగతానికి ఒడిగట్టారు. అధికార పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేస్తే దిక్కే లేదు. రాష్ట్రమంతా రౌడీలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నా స్పందించడం లేదు.దాడి చేస్తున్న వారి కేసులన్నీ ఎత్తేస్తూ నిర్ణయాలు తీసుకుంటుంటే నేరస్తుల్లో ధీమా పెరుగుతుందని, అందువల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు తగ్గిపోతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.

మరోవైపు గన్‌తో సెటిల్ మెంట్లు అనే విష సంస్కృతి జగన్ రెడ్డి పాలనకు ట్రేడ్ మార్క్ అయ్యిందన్న విమర్శలు ఉన్నాయి. బంగారం లాంటి రాష్ట్రాన్ని విధ్వంసాలకు, అకృత్యాలకు కేంద్రంగా మార్చారన్న ఆందోళనలు వ్యక్తమవుతుంది.రాష్ట్రాన్ని నేరగాళ్లు, హంతకులు, కబ్జా దారుల పాల్జేసి రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్ గా, హత్యాంధ్ర ప్రదేశ్ గా మారుస్తున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.

ఇక రాష్ట్రంలో ప్రైవేటు ఆస్తుల కబ్జా నిత్యకృత్యం అయిందని.. దశాబ్దాల పాటు శ్రమించి ప్రజలు సంపాదించుకున్న ఆస్తిని వైసీపీ రాక్షసులు కబ్జా చేస్తున్నారని చంద్రబాబు ఫైర్‌ అయ్యారు.బాపట్ల జిల్లాలో అభంశుభం తెలియని ఒక బాలుడిని అత్యంత పాశవికంగా సజీవ దహనం చేసిన ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, వైసీపీ నేతల భూకబ్జాలు, నేరగాళ్ల విశృంఖలత్వం, బిల్లులు రాక కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారుఅనంతపురంలో తన ఆస్తిని ఆక్రమించుకుంటే ప్రింటింగ్ ప్రెస్ యజమాని వంశీ కబ్జా దారులను ఎదుర్కొనలేక ప్రాణాలు తీసుకున్న ఉదంతాన్ని లేఖలో ప్రస్తావించారు.. రాష్ట్రంలో వైసీపీ అక్రమార్కుల సెటిల్మెంట్లు, ప్రజల ఆస్తుల కబ్జాలు, బెదిరింపులు, వేధింపులకు ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోందన్నారు..

Tags

Read MoreRead Less
Next Story