AP: నేడు భారీ వర్షాలు.. బయటకు రావొద్దని హెచ్చరిక

AP: నేడు భారీ వర్షాలు.. బయటకు రావొద్దని హెచ్చరిక
X
తుపాను ప్రభావిత జిల్లాల్లో "రేషన్"

తీరం వైపు దూ­సు­కొ­స్తు­న్న మొం­థా తు­ఫా­న్‌ ఇప్పు­డు ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని పలు జి­ల్లా­ల­ను టె­న్ష­న్‌ పె­డు­తోం­ది.. మొం­థా తు­ఫా­న్‌ ప్ర­భా­వం­తో రేపు వి­జ­య­వా­డ­లో 162 మి­ల్లీ­మీ­ట­ర్ల వర్ష­పా­తం నమో­ద­య్యే అవ­కా­శం ఉం­ద­ని వా­తా­వ­రణ శాఖ హె­చ్చ­రి­క­ల­తో అప్ర­మ­త్త­మ­య్యా­రు వి­జ­య­వాడ ము­న్సి­ప­ల్‌ కా­ర్పొ­రే­ష­న్‌ (వీ­ఎం­సీ) అధి­కా­రు­లు.. రేపు అత్య­వ­స­ర­మై­తే తప్పా ప్ర­జ­ల­కు ఇళ్ల నుం­చి బయ­ట­కు రా­వ­ద్ద­ని సూ­చి­స్తు­న్న అధి­కా­రు­లు.. తీ­వ్రత ఎక్కువ ఉంటే దు­కా­ణా­లు, వా­ణి­జ్య సం­స్థ­లు మూ­సి­వే­యా­ల­ని వి­జ్ఞ­ప్తి చే­స్తు­న్నా­రు అధి­కా­రు­లు.. మె­డి­క­ల్ షా­పు­లు, కూ­ర­గా­య­లు, పాలు వి­క్రయ దు­కా­ణా­లు తె­రు­చు­కో­వ­చ్చ­ని సూ­చి­స్తు­న్నా­రు.. రో­డ్ల­పై రా­క­పో­క­లు తగ్గిం­చు­కో­వా­ల­ని వా­ర్నిం­గ్ ఇచ్చా­రు వీ­ఎం­సీ అధి­కా­రు­లు.. చి­వ­ర­కు వా­కిం­గ్ కి వె­ళ్లొ­ద్ద­ని సూ­చిం­చా­రు. ఎన్టీ­ఆ­ర్ జి­ల్లా కలె­క్ట­రే­ట్, వీ­ఎం­సీ ప్ర­ధాన కా­ర్యా­ల­యం­లో కం­ట్రో­ల్ రూ­మ్‌­లు ఏర్పా­టు చే­శా­రు.

నేడు కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు

‘వి­ద్యా సం­స్థ­ల­కు ఇప్ప­టి­కే సె­ల­వు­లు ప్ర­క­టిం­చాం. సో­మ­వా­రం నుం­చి ఉత్తర, దక్షిణ కో­స్తా­జి­ల్లా­ల్లో వా­న­లు కు­రు­స్తు­న్నా­యి. కృ­ష్ణా జి­ల్లా­లో మం­గ­ళ­వా­రం అతి భారీ వర్షా­లు కు­రి­సే అవ­కా­శం ఉంది. గుం­టూ­రు, బా­ప­ట్ల, ఎన్టీ­ఆ­ర్, పల్నా­డు, పశ్చి­మ­గో­దా­వ­రి జి­ల్లా­ల్లో­నూ వర్షా­లు కు­రి­సే అవ­కా­శం ఉంది’ అని అధి­కా­రు­లు ము­ఖ్య­మం­త్రి­కి వి­వ­రిం­చా­రు. సమా­వే­శం­లో మం­త్రు­లు లో­కే­శ్, అనిత, ప్ర­భు­త్వ ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి వి­జ­యా­నం­ద్, అధి­కా­రు­లు పా­ల్గొ­న్నా­రు. పూ­ర్తి అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని ఆదే­శిం­చా­రు.

తుపాను ప్రభావిత జిల్లాల్లో "రేషన్"

తు­పా­ను ప్ర­భా­వం ఉన్న 12 జి­ల్లా­ల్లో రే­ష­న్‌ డి­పోల ద్వా­రా నేటి నుం­చే రే­ష­న్‌ సర­కు­ల­ను పం­పి­ణీ చే­య­ను­న్న­ట్లు పౌర సర­ఫ­రాల శాఖ మం­త్రి మనో­హ­ర్‌ వె­ల్ల­డిం­చా­రు. వర్షం వల్ల బా­ధి­తు­ల­కు అం­డ­గా ని­లి­చేం­దు­కు ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­మ­ని నా­దెం­డ్ల వె­ల్ల­డిం­చా­రు. గర్భి­ణు­లు, బా­లిం­త­లు, వృ­ద్ధు­లు, రో­గుల వి­వ­రా­లు తె­లు­సు­కొ­ని.. వా­రి­ని సు­ర­క్షిత ప్రాం­తా­ల­కు తర­లిం­చా­ల­ని ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. 24 గం­ట­లూ తు­ఫా­న్ ప్ర­భా­విత ప్రాం­తా­ల్లో వై­ద్య సి­బ్బం­ది­ని అం­దు­బా­టు­లో ఉం­చా­ల­ని ఆదే­శా­లు జారీ చే­శా­రు.

తప్పుడు ప్రచారం వద్దు: హోంమంత్రి

మొం­థా’ తు­పా­ను నే­ప­థ్యం­లో సో­ష­ల్ మీడియా­ల్లో వచ్చే తప్పు­డు సమా­చా­రం­పై ప్ర­జ­లు అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని హోం­మం­త్రి అనిత సూ­చిం­చా­రు. తు­పా­ను­పై సా­మా­జిక మా­ధ్య­మా­ల్లో సం­య­మ­నం పా­టిం­చా­ల­ని.. థం­బ్‌­నె­యి­ల్స్‌­తో ప్ర­జ­ల­ను తప్పు­దా­రి పట్టిం­చ­వ­ద్ద­ని పే­ర్కొ­న్నా­రు. సం­చ­లన హె­డ్డిం­గ్‌­ల­తో ప్ర­జ­ల­ను భయ­భ్రాం­తు­ల­కు గు­రి­చే­య­వ­ద్ద­న్నా­రు. తు­పా­ను సహా­యక చర్య­ల్లో ప్ర­భు­త్వం పూ­ర్తి సన్న­ద్ధం­గా ఉం­ద­ని పే­ర్కొ­న్నా­రు. అన్ని జి­ల్లా­లో­ని కలె­క్ట­రే­ట్ల­లో­నూ, కం­ట్రో­ల్‌­రూం­లు ఏర్పా­టు చే­శా­రని తె­లి­పా­రు.

ఒక్కో కుటుంబానికి రూ.3వేల సాయం

మొం­థా తు­పా­ను­పై కలె­క్ట­ర్లు, ఎస్పీ­ల­తో సీఎం చం­ద్ర­బా­బు టె­లీ­కా­న్ఫ­రె­న్స్‌ ని­ర్వ­హిం­చా­రు. పు­న­రా­వాస కేం­ద్రా­ల్లో ఉన్న ఒక్కో కు­టుం­బా­ని­కి రూ.3 వేల చొ­ప్పున ఇచ్చి, 25 కి­లోల బి­య్యం, ని­త్యా­వ­స­రా­లు పం­పి­ణీ చే­యా­ల­న్నా­రు. పు­న­రా­వాస కేం­ద్రా­ల్లో వై­ద్య శి­బి­రా­లు ఏర్పా­టు చే­యా­ల­ని పే­ర్కొ­న్నా­రు. అలా­గే జి­ల్లా­ల్లో అత్య­వ­సర వై­ద్య సే­వ­లు అం­దిం­చే సి­బ్బం­ది అం­దు­బా­టు­లో ఉం­డా­ల­ని ఆదే­శిం­చా­రు. తు­పా­ను­ల్ని ఎదు­ర్కొ­నేం­దు­కు కూడా ముం­దు­గా­నే ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­దిం­చా­ల­ని సూ­చిం­చా­రు.

Tags

Next Story