కృష్ణాజిల్లా పరిటాలలో అక్రమ మైనింగ్‌పై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
AP High Court: ప్రకృతి వనరులు దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోబోమన్న హైకోర్టు
BY Gunnesh UV4 Aug 2021 3:13 AM GMT

X
Gunnesh UV4 Aug 2021 3:13 AM GMT
కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గం పరిటాల గ్రామంలో అక్రమ మైనింగ్‌పై హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రకృతి వనరులు దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది. సాగునీటి కాలువను ఆక్రమించి మైనింగ్ చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్లని హైకోర్టు ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌తో పాటు గనుల శాఖ.. కాలుష్య నియంత్రణ మండలికి నోటీసులు జారీ చేసింది.
Next Story