AP High Court: సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టు సీరియస్..

AP High Court: సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో యూట్యూబ్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాలో ఉన్న పంచ్ ప్రభాకర్ ప్రైవేట్ యూజర్ ఐడీ పెట్టుకొని అడిగిన వారికి వ్యూస్ ఇస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ తరపు న్యాయవాది అశ్విన్‌కుమార్. పంచ్ ప్రభాకర్ ప్రైవేట్ వ్యూస్‌ని ఇస్తూ ఇంకా అగౌరవ పరుస్తున్నారని అఫిడవిట్ దాఖలు చేశారు. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పంచ్ ప్రభాకర్ గురించి ప్రస్తావించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది హైకోర్టు.
పంచ్ ప్రభాకర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని సీబీఐని నిలదీసింది హైకోర్టు. అమెరికాలో ఉండటంతో ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ. నూతన పద్ధతిలో పంచ్ ప్రభాకర్ వ్యూస్ పెడుతుంటే మీరేం చేస్తున్నారని యూట్యూబ్‌ను ప్రశ్నించింది హైకోర్టు. ప్రభాకర్ అరెస్టుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మార్చి 21 లోపు కోర్టుకు తెలపాలని ఆదేశించింది. ప్రైవేట్ వ్యూస్ నిషేధించడానికి తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని యూట్యూబ్‌ను ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com