High Court : అట్రాసిటీ కేసుల్లో కీలక తీర్పు ఇచ్చిన ఏపీ హైకోర్టు..

High Court : అట్రాసిటీ కేసుల్లో కీలక తీర్పు ఇచ్చిన ఏపీ హైకోర్టు..
X

అట్రాసిటీ కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, విడదల రజిని దాఖలు చేసిన పిటిషన్లపై జరిగిన విచారణలో ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది.

ఈ మేరకు అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను నేరుగా హైకోర్టులోనే దాఖలు చేయవచ్చని, ప్రత్యేక కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ప్రాథమిక ఆధారాలు పక్కాగా ఉన్న కేసుల్లో మాత్రం ముందస్తు బెయిల్పై నిషేధం వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో అట్రాసిటీ కేసుల్లో నిందితులకు ముందస్తు బెయిల్ పొందే అవకాశం లభించింది. మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, విడదల రజినిలపై నమోదైన కేసులకు సంబంధించి ఈ పిటిషన్లను హైకోర్టు విచారించింది. కేసుల్లోని అంశాలను పరిశీలించిన అనంతరం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తాజా తీర్పు న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags

Next Story