YS Viveka : వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐకి ఏపీ హైకోర్టు ఆదేశాలు

X
AP High Court (tv5news.in)
By - TV5 Digital Team |7 Jan 2022 8:47 AM IST
YS Viveka : దస్తగిరిని అప్రూవర్‌గా మారుస్తూ సీబీఐ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలంటూ గంగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
వివేకా హత్య కేసులో సీబీఐకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దస్తగిరిని అప్రూవర్‌గా మారుస్తూ సీబీఐ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలంటూ గంగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం.... ఇప్పటివరకు నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టుకు అందజేయాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. ప్రాథమిక అభియోగ పత్రం కూడా కోర్టుకు అందించాలని హైకోర్టు సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com