AP High Court: కొండపల్లి మున్సిపల్ ఎన్నికల కేసు విచారణలో కీలక మలుపు..
AP High Court: కొండపల్లి మున్సిపల్ ఎన్నికల కేసు విచారణలో.. ఏపీ హైకోర్టులో అనూహ్యమైన పరిణామాలు జరిగాయి. కేసు విచారణ నుంచి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ తప్పుకోవడం సంచలనంగా మారింది. కేసు విచారణ సమయంలో కొండపల్లి కౌన్సిలర్ తరఫు లాయర్.. జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ బెంచ్‌తో వాదనకు దిగారు. దీంతో భోజన విరామం తర్వాత విచారణకు వచ్చిన జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్.. ఈ కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేయాలని చీఫ్ జస్టిస్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే కారణాలను కూడా రికార్డ్ చేయాలని ఎంపీ కేశినేని నాని తరఫు లాయర్ అశ్వనీకుమార్ కోరగా.. కారణాలు రికార్డ్ చేస్తున్నానని చెప్పి.. జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com