SI Recrutment: ఎస్సై నియామక ప్రక్రియపై ఏపీ హైకోర్టు విచారణ

SI Recrutment: ఎస్సై నియామక ప్రక్రియపై ఏపీ హైకోర్టు విచారణ
అభ్యర్థుల ఎత్తు కొలతలపై వివాదం..

ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎస్సై నియామక ప్రక్రియకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ దారు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పిటిషన్ దారులు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. ఎస్సై నియామక ప్రక్రియలో ఎత్తు కొలతలకు సంబంధించి తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నియామక ప్రక్రియపై సింగిల్ బెంచ్ జడ్జి స్టే విధించారు. ఈ స్టేను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసింది.

నియామక ప్రక్రియలో ఎత్తు కొలిచే విధానంపై పలువురు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఆర్ఎస్ఐగా పనిచేసిన అభ్యర్థిని కూడా ఎత్తు సరిపోలేదంటూ పక్కకు తప్పించారని ఆరోపించారు. దీనిపై అభ్యర్థుల తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో అభ్యర్థుల ఎత్తు కొలతలను కోర్టు సమక్షంలో తీసుకోవాలని జడ్జి సూచించారు.

అంతేకాకుండా దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేస్తుందని, ఇందులో అభ్యర్థుల ఎత్తును తిరిగి కొలుస్తామని కూడా తెలిపింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయమూర్తి హైకోర్టుకు గతంలో అభ్యర్థులకు ఎత్తు కొలిచిన వీడియోను కూడా అందజేశారు. దీన్ని పరిశీలించి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే ఎత్తివేయాలని కోరారు. కానీ, హైకోర్టు డివిజన్ బెచ్ స్టే ఎత్తవేతకు నిరాకరించింది.

దీంతో పాటు ఎత్తుకు సంబంధించి అభ్యర్థులు నకిలీ ఆరోపణలు చేసినట్లు నిర్ధారణ అయితే ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని హైకోర్టు డివిజన్ బెంచ్ హెచ్చరించింది. దీనిపై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. పిటిషనర్లు అందరూ సోమవారం కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు పర్యవేక్షణలో డిస్ క్వాలిఫై అయిన అభ్యర్థుల ఎత్తును అధికారులు కోలవనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story