కోర్టు ధిక్కార కేసులో ఏపీ హైకోర్టు ఆగ్రహం..!

Ap High court (File photo)
కోర్టు ధిక్కార కేసులో ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణను అదుపులోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశించింది. కృష్ణా జిల్లా కలిదిండి పంచాయతీ కార్యదర్శి శ్రీమన్నారాయణకు బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు అమలుచేసినప్పటికీ...గత వాయిదాకు ఆలస్యంగా హాజరుతో నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసింది హైకోర్టు. ఇవాళ వ్యక్తిగతంగా హాజరైన సత్యనారాయణ... వారెంట్ రికాల్ కోసం పెట్టిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రూ.50వేలు జరిమానాతోపాటు జైలుశిక్ష ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు. జరిమానా రూ.50వేలను న్యాయవాదుల సంకేమ నిధికి చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.శిక్ష నిలిపివేయాలని ఆర్థికశాఖ కార్యదర్శితోపాటు ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం ముందు ప్రభుత్వం ప్రస్తావించింది. దీనిపై లంచ్ తర్వాత పరిశీలిస్తామన్నతెలిపింది హైకోర్టు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com