ఆంధ్రప్రదేశ్

AP High Court: కోర్టుల గురించి, జడ్జీల గురించి మాట్లాడితే ఆటోమేటిక్‌గా బ్లాక్ అవ్వాలి- హైకోర్టు

AP High Court: సోషల్‌ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో.. హైకోర్టు విచారణ వాడివేడిగా జరిగింది.

AP High Court: కోర్టుల గురించి, జడ్జీల గురించి మాట్లాడితే ఆటోమేటిక్‌గా బ్లాక్ అవ్వాలి- హైకోర్టు
X

AP High Court: సోషల్‌ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో.. హైకోర్టు విచారణ వాడివేడిగా జరిగింది. దీనిపై ఇవాళ CBI రిపోర్ట్‌ ఫైల్‌ చేసింది. అటు, పంచ్ ప్రభాకర్ కొత్తగా 2 పోస్ట్‌లు పెట్టినట్టు తెలియగానే వెంటనే వాటిని బ్లాక్‌ చేశామని CBI చెప్పింది. స్టాండిగ్ కౌన్సిల్ నుంచి ఏ లెటర్ వచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటున్నట్టు వివరించింది.

అటు, పంచ్ ప్రభాకర్ వ్యవహారం ఎంతవరకూ వచ్చిందనే దానిపైనా ధర్మాసనం ఆరా తీసింది. పంచ్ ప్రభాకర్‌ను రప్పించేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖకు, విదేశీ వ్యవహారాల శాఖకు లేఖలు రాసినట్టు CBI అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. చర్యలు తీసుకునేందుకు ఇంకొంత సమయం పడుతుందని అన్నారు. ఈ కేసులో జియోబ్లాకింగ్ ఇన్‌జెంక్షన్ ఆర్డర్‌ను పాస్ చేయాలని భావిస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. అభిప్రాయాలు చెప్పాలని సీబీఐని కోరింది.

ప్రపంచవ్యాప్తంగా కోర్టుల గురించి కానీ, జడ్జీల గురించి కానీ.. ఎవరు మాట్లాడిన ఆటోమేటిక్‌గా అది బ్లాక్ అవ్వాలనేది తమ ఉద్దేశమని వివరించింది. అందుకే జియో బ్లాకింగ్ ఇన్‌జెంక్షన్‌ ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. స్టాండింగ్ కౌన్సిల్, యూట్యూబ్, ట్విట్టర్‌లు కూడా జియో బ్లాకింగ్ ఇంజెన్షన్ ఆర్డర్‌పై..వాదనలు వినిపించాలని ఆదేశించింది. విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.

Next Story

RELATED STORIES