AP High court : ట్విట్టర్‌పై ఏపీ హైకోర్టు సీరియస్‌..!

AP High court :  ట్విట్టర్‌పై ఏపీ హైకోర్టు సీరియస్‌..!
AP High court : జడ్జిలపై అనుచిత పోస్టులను పెట్టిన కేసు విచారణలో ట్విట్టర్‌పై ఏపీ హైకోర్టు సీరియస్‌ అయ్యింది.

AP High court : జడ్జిలపై అనుచిత పోస్టులను పెట్టిన కేసు విచారణలో ట్విట్టర్‌పై ఏపీ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. దేశంలోని చట్టాలు కోర్టులను గౌరవించకపోతే.. వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ట్విట్టర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది. వచ్చే వారంలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.ట్విట్టర్‌ పోస్టులు డిలీట్ చేసినా.. విపిన్‌ అని టైప్‌ చేస్తే వెంటనే వస్తున్నాయని.. ధర్మాసనం దృష్టికి న్యాయవాది అశ్విన్‌ కుమార్‌ తీసుకువచ్చారు. ట్విట్టర్‌ వద్ద ఉన్న న్యాయమూర్తులపై అభ్యంతరక పోస్టుల మెటీరియల్‌ను.. స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించిన ధర్మాసనం.. పోలీసులను పంపి స్వాధీనం చేసుకునే ఉత్తర్వులు ఇస్తామని హెచ్చరించింది. జడ్జిలపై పోస్టులు పెట్టిన విదేశాల్లో ఉన్న వారిని.. ఎప్పటిలోగా అరెస్టు చేస్తారని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. వచ్చే వారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు.. వచ్చే సోమవారానికి కేసు విచారణ వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story