AP: ఏపీలో హిందూజా రూ.20,000 కోట్ల పెట్టుబడి

AP: ఏపీలో హిందూజా రూ.20,000 కోట్ల పెట్టుబడి
X
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్ర ప్ర­భు­త్వం , హిం­దూ­జా గ్రూ­ప్ మధ్య రూ.20,000 కో­ట్ల పె­ట్టు­బ­డి ఎం­ఓ­యూ జరి­గిం­ది. ఈ ఒప్పం­దం రా­ష్ట్ర ఇం­డ­స్ట్రి­య­ల్ , క్లీ­న్ ఎన­ర్జీ రం­గా­ల్లో ఉపా­ధి అవ­కా­శా­లు, సస్టై­న­బు­ల్ డె­వ­ల­ప్‌­మెం­ట్‌­కు దో­హ­ద­ప­డు­తుం­ద­ని అధి­కా­రు­లు తె­లి­పా­రు. ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు లం­డ­న్ పర్య­ట­న­లో పా­రి­శ్రా­మి­క­వే­త్త­ల­తో సమా­వే­శ­మ­య్యా­రు. ఈ సం­ద­ర్భం­గా హిం­దూ­జా గ్రూ­ప్ చై­ర్మ­న్ ఆశో­క్ పి. హిం­దూ­జా, యూ­ర­ప్ చై­ర్మ­న్ ప్ర­కా­ష్ హిం­దూ­జా, సీఈఓ వి­వే­క్ నందా.. ఎం­ఓ­యూ చే­సు­కు­న్నా­రు. ఈ ఎం­ఓ­యూ ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­ను గ్రీ­న్ ఎన­ర్జీ, ఎల­క్ట్రి­క్ వె­హి­క­ల్స్హ బ్‌­గా మా­ర్చే లక్ష్యం­తో రూ­పొం­దిం­ది. హిం­దూ­జా గ్రూ­ప్, ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా బ్యాం­కిం­గ్, ఆటో­మొ­బై­ల్స్, ఎన­ర్జీ రం­గా­ల్లో ఉన్న భా­ర­తీయ మల్టీ-నే­ష­న­ల్ కా­ర్పొ­రే­ట్ కం­పె­నీ. ఈ పె­ట్టు­బ­డి ద్వా­రా రా­ష్ట్ర వి­ద్యు­త్, పు­న­రు­త్పా­దక శక్తి, ట్రా­న్స్‌­పో­ర్ట్ సె­క్ట­ర్ల­లో వి­ప్ల­వా­త్మక మా­ర్పు­లు తీ­సు­కు­రా­వా­ల­ని భా­వి­స్తు­న్నా­రు.

మరో 1,600 మెగావాట్ల వరకు...

విశాఖలోని హిందూజా సంస్థకు ప్రస్తుతమున్న 1,050 మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్‌ను అదనంగా మరో 1,600 మెగావాట్ల వరకు సామర్థ్యాన్ని పెంచనుంది. ఇక్కడ ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు కొత్త యూనిట్లను స్థాపిస్తుంది. రాయలసీమలో భారీ సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులు ఏర్పా టు చేస్తుంది. ఆధునిక ఎలక్ట్రిక్‌ బస్సులు, తేలికపాటి వాణిజ్య వాహనాల తయారీ లక్ష్యంగా కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్‌ నెలకొల్పనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈవీ చార్జింగ్‌ నెట్‌వర్క్‌ తీసుకురానుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపైన హిందూ జా ప్రతినిధులు సంతకాలు చేశారు.

రోల్స్‌ రాయిస్‌కు ఆహ్వానం

ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్స్‌, డీజిల్‌ ప్రొపెల్షన్‌ సిస్టమ్స్‌ తయారీలో అంతర్జాతీయ స్థాయిలో పేరున్న రోల్స్‌ రాయిస్‌ గ్రూప్‌ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. సంస్థ సీటీవో నిక్కి గ్రేడి స్మిత్‌తో జరిగిన భేటీలో.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఓర్వకల్లులో మిలటరీ ఎయిర్‌ స్ట్రిప్‌, విమానాల మెయింటెనెన్స్‌, రిపెయిర్‌, ఓవర్‌ హాలింగ్‌(ఎంఆర్‌ఓ) యూనిట్‌ ఏర్పాటుకు అవకాశాలున్నాయని తెలిపారు.

Tags

Next Story