AP: పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం

AP: పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం
X
వైసీపీ పాలనలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం.. పోలీసు శాఖకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి

ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పోలీసు శాఖకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని హోం మంత్రి చెప్పారు. 17 గదులతో విశాలంగా నిర్మించిన ఆరిలోవ పోలీస్ స్టేషన్ నూతన ప్రాంగణాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు తో కలిసి హోం మంత్రి ప్రారంభించారు. ఈ భవనంలో ఏసీపీ కార్యాలయం నిర్మాణం కోసం అదనపు అంతస్తు నిర్మించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోలీస్ స్టేషన్ వసతి లోపంతో ఇంతకాలంగా దయనీయ పరిస్థితుల్లో ఉండేదని, ఇప్పుడు విశాల భవనంలోకి మారడం సంతోషకరమన్నారు. భీమిలి నియోజకవర్గంలోని దివిస్ లేబరేటరీ లిమిటెడ్ ఫార్మా సిటికల్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ పోలీస్ స్టేషన్ లో ఫర్నిచర్ కోసం రూ.16 లక్షలు విరాళంగా ఇచ్చారని యాజమాన్యాన్ని అభినందించారు. ఈ పోలీస్ స్టేషన్ వద్ద మెరుగైన రహదారి నిమిత్తం జీవీఎంసీ నుండి కోటి రూపాయల మంజూరుకు కృషి చేస్తానని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు.

విజయసాయిపై తీవ్ర విమర్శలు

సీఎం చంద్రబాబు పట్ల విజయసాయిరెడ్డి మాటలు దారుణమని, బాధాకరమని హోంమంత్రి అనిత అన్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని విషయాలు బయటకు వస్తున్నాయని ఆమె చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు చాలా మంది ప్రజలను సైతం బెదిరించారని తెలిపారు. బియ్యం అక్రమ రవాణాపై సీబీసీఐడీ దర్యాప్తు చేస్తోందన్నారు. ఎక్కడ భూ ఆక్రమణల ఫిర్యాదులు వచ్చినా అందులో వైసీపీ నేతల పాత్రే ఉందని చెప్పారు.

పోర్టుపై కీలక వ్యాఖ్యలు

కాకినాడ పోర్ట్ వ్యవహారంలో అన్ని తెలుస్తున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. వైసీపీ నేతలు అందరినీ బెదిరించారని ఆరోపించారు. బియ్యం అక్రమ రవాణా మీద సీబీసీఐడీ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ చక్కగా పని చేస్తోందని ప్రశంసించారు. ఎక్కడ భూ అక్రమాలు చూసినా అందులో వైసీపీ నేతలు పాత్ర ఉందని విమర్శించారు. విశాఖలో మాజీ ఎంపీ ఏంవీవీ సత్యనారాయణ అక్రమాలు బయటకు వచ్చాయన్నారు. గడిచిన ఐదేళ్లలో ఒక్క పోలీస్ స్టేషన్ నిర్వహణ సరిగా చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై దృష్టి పెట్టామన్నారు.

Tags

Next Story