AP: జైల్లో గంజాయిని సహించేదే లేదు

విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయని, పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని... ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖ సెంట్రల్ జైల్ ను అనిత ఆదివారం పరిశీలించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయని, పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వలనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్నారు . జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వలనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఖైదీల రక్షణే ముఖ్యమని అన్నారు. ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయని, సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించామని, విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్‌లో ఎవరు ఎవరుతో మాట్లాడారో తెలుసుకుని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చర్యలు తప్పవు..
జైల్‌లో గంజాయి మొక్క కనిపించిందని, విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ఎవ్వరిని ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ చేసిన తర్వాతే విశాఖ సెంట్రల్ జైల్‌లో ఉద్యోగులను బదిలీలు చేస్తామని, ఇప్పటి వరకు ఎవ్వరిని సస్పెండ్ చేయలేదని ఆమె తెలిపారు. యూనిఫాం సర్విసులో ఉన్నవారు ధర్నాలో, బందులో పాల్గొనకూడదన్నారు. కొత్త సూపరింటెండెంట్ సెంట్రల్ జైల్‌ను ప్రక్షాళన చేస్తున్నారన్నారు. టెక్నాలజీని కూడా ఉపయోగగించుకుంటామని, సెంటర్ జైల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, పదిరోజులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
గత ఐదేళ్లు నిర్లక్ష్యమే..
విశాఖ సెట్రల్ జైల్ నుండి కొంతమంది ఖైదీలను రాజమండ్రి జైల్‌కు తరలిస్తున్నామన్నారు. గత ఐదు సంవత్సరాలు సెంట్రల్ జైల్‌ను విజిట్ చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. టెక్నాలజీ నుండి ఎవ్వరు తప్పించుకోలేరన్నారు. పది, పదిహేను రోజుల్లో సెల్ ఫోన్ వ్యవహరంలో విచారణ రిపోర్టు వస్తుందని, జైల్లో సిబ్బందిని పెంచుతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com