AP: పరువు హత్య.. పెళ్లైన కాసేపటికే చంపేశారు

ఆంధ్రప్రదేశ్‌లో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల జీవితాన్ని కేవలం కొద్ది గంటల్లోనే రక్తపాతంగా మారింది. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. పెద్దల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోవడమే యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. సమాజంలో ఇంకా కొనసాగుతున్న కుల, కుటుంబ పరువుల పేరుతో జరిగే హింసకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో పరువు హత్య కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వేములపల్లిలో డిప్యూటీ ఎమ్మార్వోగా పని చేస్తున్న సంధ్య.. సూర్య ప్రకాష్‌ను ప్రేమించింది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవటంతో గురువారం వీరు అన్నవరం వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి ఇష్టంలేని యువతి సోదరులు.. బైక్‌పై తిరిగి వస్తుండగా వీరిని ఆపి యువకుడిని రాళ్లతో కొట్టి చంపారు. అది జీర్ణించుకోలేకపోయిన యువతి సోదరులు సూర్యప్రకాష్ ను ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ చేశారు. వేములపల్లిలో యువకుడి కోసం దారికాచి దారుణంగా హతమార్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంధ్య రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తోంది కళ్లముందే భర్తను కోల్పోయిన సంధ్య తీవ్ర షాక్‌కు గురైంది. ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పరువు పేరుతో జరిగిన ఈ హత్యపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
