AP: ఏపీలో రూ.1.5 లక్షల కోట్లతో భారీ స్టీల్ ప్లాంట్

AP: ఏపీలో రూ.1.5 లక్షల కోట్లతో భారీ స్టీల్ ప్లాంట్
X
అమరావతికి క్యూ కడుతున్న దిగ్గజ సంస్థలు

పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షి­స్తు­న్న రా­ష్ట్రా­ల్లో ఏపీ దూ­సు­కె­ళ్తోం­ది. ఏఐ డేటా సెం­ట­ర్ల­తో వి­శాఖ రూ­పు­రే­ఖ­లు మా­ర­ను­న్నా­యి. దాని అను­బం­ధం­గా మరి­న్ని సం­స్థ­లు వి­శా­ఖ­వై­పు మొ­గ్గు చూ­పు­తు­న్నా­యి. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో ఆర్సె­ల­ర్ మి­ట్ట­ల్ & ని­ప్పా­న్ స్టీ­ల్స్ (AM/NS) భారీ ఉక్కు కర్మా­గా­రం ఏర్పా­టు కా­నుం­ది. అన­కా­ప­ల్లి సమీ­పం­లో ఆర్సె­ల­ర్ మి­ట్ట­ల్ & ని­ప్పా­న్ స్టీ­ల్స్ ఏర్పా­టు చేసే భారీ ఉక్కు కర్మా­గా­రా­ని­కి భారత పర్యా­వ­రణ, అటవీ మం­త్రి­త్వ శాఖ ఎక్స్‌­ప­ర్ట్ అప్రై­జ­ల్ కమి­టీ పర్యా­వ­రణ అను­మ­తి­కి సి­ఫా­ర­సు చే­సిం­ది. రూ. 1.5 లక్షల కో­ట్ల భారీ పె­ట్టు­బ­డి­తో స్థా­పిం­చ­ను­న్న ఈ స్టీ­ల్ ప్లాం­ట్, సం­వ­త్స­రా­ని­కి 8.2 మి­లి­య­న్ టన్నుల వా­ర్షిక ఉత్ప­త్తి సా­మ­ర్థ్యం­తో భా­ర­త­దే­శం­లో­నే అతి­పె­ద్ద గ్రీ­న్‌­ఫీ­ల్డ్ ఉక్కు తయా­రీ కర్మా­గా­రం­గా ని­ల­వ­నుం­ది.

విశాఖ సమ్మిట్‌లో భూమిపూజ

నవం­బ­ర్ 14,15 తే­దీ­ల్లో ఈ ప్రా­జె­క్టు­కు సం­బం­ధిం­చిన భూమి పూ­జ­ను వి­శా­ఖ­ప­ట్నం­లో ని­ర్వ­హిం­చ­ను­న్న భా­గ­స్వా­మ్య సమ్మి­ట్‌­లో చే­య­ను­న్నా­రు. ఈ కర్మా­గా­రా­న్ని అత్యా­ధు­నిక సాం­కే­తి­క­త­తో ప్ర­స్తుత వా­తా­వ­రణ పరి­స్థి­తు­ల­కు అను­గు­ణం­గా, అత్యంత తక్కువ వాయు కా­లు­ష్యం ఉం­డే­లా అం­త­ర్జా­తీయ స్థా­యి ప్ర­మా­ణా­ల­తో ని­ర్మిం­చ­ను­న్నా­రు. AM/NS కర్మా­గా­రా­న్ని వి­విధ దశ­ల్లో అభి­వృ­ద్ధి చే­యా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­రు. మొ­ద­టి దశలో 8.2 మి­లి­య­న్ టన్నుల సా­మ­ర్థ్యం­తో ఇం­టి­గ్రే­టె­డ్ స్టీ­ల్ ప్లాం­ట్ ని­ర్మా­ణం చే­ప­ట్ట­గా, చి­వ­ర­గా 24 మి­లి­య­న్ టన్నుల సా­మ­ర్థ్యం వరకు వి­స్త­రిం­చ­ను­న్నా­రు. ఆర్సె­ల­ర్ మి­ట్ట­ల్ & ని­ప్పా­న్ స్టీ­ల్స్ కర్మా­గా­రం పూ­ర్తి స్థా­యి­లో కా­ర్య­క­లా­పా­లు ప్రా­రం­భిం­చిన తర్వాత ఏపీ ఇం­డ­స్ట్రి­య­ల్ కా­రి­డా­ర్‌­లో ప్ర­ధాన పరి­శ్ర­మ­గా స్థా­నం­లో ని­ల­వ­నుం­ది. దీ­ని­కి అను­బం­ధం­గా ఉక్కు ఆధా­రిత ఔట్‌­పు­ట్ యూ­ని­ట్లు, యం­త్ర పరి­క­రాల (మి­ష­న­రీ) తయా­రీ క్ల­స్ట­ర్లు, లా­జి­స్టి­క్స్ నె­ట్‌­వ­ర్క్‌­లు వం­టి­వి అభి­వృ­ద్ధి చెం­దు­తా­యి. పరి­శ్రమ ఏర్పా­టు­కు అవ­స­ర­మైన అన్ని అను­మ­తు­లు లభిం­చే వరకు సిం­గి­ల్-విం­డో మా­ధ్య­మం ద్వా­రా తక్షణ సహాయ సహ­కా­రా­ల­ను అం­దిం­చిం­ది.

మరోవైపు.. అమరావతి రాజధానికి వెళ్లే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఈ-3 రోడ్డును పాత జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు కేఎల్‌రావు కాలనీ వద్ద కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై స్టీల్‌ వంతెన నిర్మించేందుకు అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏడీసీఎల్‌) రూ.70 కోట్లతో పనులు ప్రారంభించింది.

Tags

Next Story