AP: గలగలా గోదారి తరలిపోతుంటే..

AP: గలగలా గోదారి తరలిపోతుంటే..
X

భారీ వర్షా­ల­తో­పా­టు ఎగువ ప్రాం­తాల నుం­చి వర­ద­నీ­రు చే­ర­డం­తో ఏలూ­రు జి­ల్లా పో­ల­వ­రం వద్ద గో­దా­వ­రి ఉద్ధృ­తం­గా ప్ర­వ­హి­స్తోం­ది. ఈ వరద కా­ర­ణం­గా పో­ల­వ­రం జలా­శ­యం నీ­టి­మ­ట్టం భా­రీ­గా పె­రు­గు­తోం­ది. దీం­తో అధి­కా­రు­లు ప్రా­జె­క్ట్ రే­డి­య­ల్ గే­ట్ల ద్వా­రా నీ­టి­ని ది­గు­వ­కు వి­డు­దల చే­స్తు­న్నా­రు. ఎగువ ప్రాం­తా­ల్లో కు­రు­స్తు­న్న వర్షా­ల­కు గో­దా­వ­రి­కి పె­ద్దఎ­త్తున వరద వచ్చి చే­రు­తోం­ది. లవరం ప్రా­జె­క్టు­లో­కి వస్తు­న్న 2,37,203 క్యూ­సె­క్కుల నీ­టి­ని స్పి­ల్‌­వే 48 గే­ట్ల నుం­చి ది­గు­వ­కు వి­డు­దల చే­స్తు­న్న­ట్టు అధి­కా­రు­లు తె­లి­పా­రు. మరో­వై­పు.. చం­ద్ర­బా­బు ప్ర­తి­ష్ఠా­త్మ­కం­గా తల­పె­ట్టిన పో­ల­వ­రం ప్రా­జె­క్టు పను­లు వేగం పుం­జు­కు­న్నా­యి. ఇప్ప­టి­కే పో­ల­వ­రం కుడి ప్ర­ధాన కా­లువ పను­లు సు­మా­రు­గా పూ­ర్త­య్యా­యి. ఎడమ ప్ర­ధాన కా­లువ పను­లు కూడా వే­గ­వం­తం చే­శా­రు. ఈ నె­లా­ఖ­రు­క­ల్లా పూ­ర్తి చే­యా­ల­నే లక్ష్యం­తో 8 ప్యా­కే­జీల కింద వి­భ­జిం­చి పను­లు చే­స్తు­న్నా­రు. 38,060 ని­ర్వా­సితు­ల­కు పు­న­రా­వా­సం కల్పిం­చా­ల్సి ఉంది.

Tags

Next Story