AP: నేటి నుంచే ఏపీ ఇంటర్ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. నేటి (మార్చి 1) నుంచి ఇంటర్ ఫస్టియర్, మార్చి 3 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 20 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్ల వద్దకు చేరుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 1,535 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించనున్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. 26 జిల్లాల్లో దాదాపు 10,58,892 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారు. అలాగే మార్చి 3 నుంచి 15 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో దాదాపు పది లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు.
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెగ్యులర్ ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1535 కేంద్రాలను ఏర్పాట్లు చేయగా.. అందులో 68 సెంటర్లను సున్నిత, 36 కేంద్రాలను అతి సున్నితమైనవిగా అధికారులు గుర్తించారు. వీటన్నింటిలో సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబరు 18004251531 ఏర్పాటు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
తెలంగాణలోనూ..
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతకుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలు సజావుగా జరగడానికి చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్లకు సలహాలు, సూచనలిచ్చారు. కాపీయింగ్కు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదని సీఎస్ స్పష్టం చేశారు. ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్లకు మార్చి 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు, సెకండియర్ స్టూడెంట్లకు మార్చి 6వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎగ్జామ్స్ ఉంటాయని బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బ్యాక్ లాగ్ స్టూడెంట్లకు జనవరి 29న ఇంటర్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఉంటుందన్నారు. 30న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ జరగనుందని చెప్పారు. ఈ పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ జనవరి 31న, సెకండియర్ విద్యార్థులకు ఫిబ్రవరి1న పెట్టనున్నట్టు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com