AP Inter Result 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎంతమంది పాస్ అంటే..?

AP Inter Result 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎంతమంది పాస్ అంటే..?
X
AP Inter Result 2022: ఏపీ ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈసారి ఇంటర్‌లో పాస్‌ పర్సెంటేజ్‌ తగ్గింది.

AP Inter Result 2022: ఏపీ ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈసారి ఇంటర్‌లో పాస్‌ పర్సెంటేజ్‌ తగ్గింది. ఇంటర్‌ ఫస్టియర్‌లో 54 శాతం మంది మాత్రమే గట్టెక్కారు. సెకండియర్‌ 61 శాతం మంది పాస్ అయ్యారు. ఇంటర్‌ పరీక్షా ఫలితాల్ని విడుదల చేసిన మంత్రి బొత్స.. ఈసారి 28 రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు ప్రకటించామన్నారు.

ఈసారి ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాల్ని ఒకేసారి ప్రకటించారు. మొత్తంగా 9 లక్షల 40 వేల మంది ఇంటర్‌ పరీక్షలు రాశారు. ఫస్టియర్‌లో 4 లక్షల 45 వేల మంది రాస్తే పాసైంది 2 లక్షల 41 వేల 599 మంది. ఇక సెకండియర్‌లో 4 లక్షల 23 వేల 450 మంది పరీక్ష రాస్తే 2 లక్షల 58 వేల 449 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా టాప్‌లో ఉంటే.. కడప లాస్ట్‌లో ఉంది.

Tags

Next Story