Andhra Pradesh : ఇంటర్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విడుదల చేసినట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.inలో చూసుకోవవచ్చని తెలిపారు. అలాగే మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కు "హాయ్" సందేశం పంపడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌లో 70 శాతం, సెకండ్ ఇయర్‌లో 83 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రభుత్వ నిర్వహణలోని విద్యా సంస్థలలో ఉత్తీర్ణత పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 10 సంవత్సరాల గరిష్ట స్థాయి (69 శాతం)కి చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం విద్యార్థులు, జూనియర్ లెక్చరర్ల కృషికి నిదర్శనం అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com