CM Chandrababu Naidu : నాలెడ్జ్ హబ్‌గా ఏపీ తయారవుతోంది: సీఎం చంద్రబాబు

ప్రపంచంలో ఎక్కడ చూసినా సాంకేతికతపైనే చర్చ జరుగుతోందని, అది మనిషి జీవితంలో భాగమైందని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో జరుగుతున్న డీప్‌టెక్ సదస్సులో మాట్లాడుతూ ‘టెక్నాలజీకి మేం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. నూతన సాంకేతిక ఆవిష్కరణల్లో ఇతర దేశాలతో పోటీ పడుతున్నాం. నాలెడ్జ్ హబ్‌గా ఏపీ తయారవుతోంది. ప్రస్తుతం డ్రోన్లు కూడా కీలకంగా మారాయి. అన్ని పనులు డ్రోన్ల ద్వారా చేసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించినట్లు గుర్తుచేశారు. విదేశాల్లో ఉన్న మనదేశ IT నిపుణుల్లో 30 శాతం మంది తెలుగువారేనని విశాఖ డీప్‌టెక్ సదస్సులో తెలిపారు. టెక్నాలజీ, విద్యుత్ రంగంలో సంస్కరణల ఘనత తనదేనన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇప్పుడు ఉందని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com