AP Floods: వరదల నుండి ఇంకా కోలుకోని ప్రజలు.. అంతలోని ఏపీకి మరో హెచ్చరిక..

X
AP Floods (tv5news.in)
By - Divya Reddy |22 Nov 2021 8:30 AM IST
AP Floods: ఒక్కసారిగా ముంచెత్తిన వరద ఏపీ ప్రజల జీవితాల్లో చీకటిని నింపేసింది.
AP Floods: ఒక్కసారిగా ముంచెత్తిన వరద ఏపీ ప్రజల జీవితాల్లో చీకటిని నింపేసింది. ఎటు వెళ్లాలో తెలీదు.. ముంచెత్తుతున్న వరద నుండి ఎలా తప్పించుకోవాలో తెలీదు.. సాయం చేసే మనుషులు లేరు.. ఈ అయోమయ స్థితిలో ఏపీకి మరో హెచ్చరిక వచ్చినట్లుగా సమాచారం.
- 4 రోజుల్లో ఏపీకి పొంచి ఉన్న మరో వాయుగండం
- దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఆవర్తన ప్రభావంతో మళ్లీ వర్షాలు
- 26 నుంచి డిసెంబర్ 2 వరకూ వానలే వానలు..!
- మళ్లీ నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురంపైనే తీవ్ర ప్రభావం
- పశ్చిమ వాయువ్య దిశగా కలుదుతున్న ఉపరితల ఆవర్తనం
- ఏపీలో వర్ష బీభత్సం నుంచి ఇంకా కోలుకోని 4 జిల్లాలు
- కొట్టుకుపోయిన వంతెనలు, కల్వర్టులు, కాజ్‌వేలు.. పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు
- వరద ఉధృతికి నేలమట్టమైన 2 వేలకుపైగా ఇళ్లు
- కడప చెయ్యేరు ప్రాంతంలో రూపురేఖలు కోల్పోయిన అనేక గ్రామాలు
- సొంత జిల్లాలో వరద విలయాన్నీ సీఎం పట్టించుకోవడం లేదంటూ విమర్శలు
- ప్రభుత్వ అరకొర సహాయ చర్యలపై బాధితుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు
- వరద ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు మరో 24 గంటలు
- 4 రోజులైనా తిరుపతిలోని పలు కాలనీల్లో మోకాలిలోతు నీళ్లు..!
- తిరుపతి రాయలచెరువుకు గండిపడకుండా రాత్రికిరాత్రి మరమ్మతులు
- కట్టుబట్టలతో ఊళ్లు వదిలి జనం పరుగులు.. సహాయ చర్యలకు NDRF బలగాలు..
- నెల్లూరు జిల్లాలో వరద నీటితో అల్లాడిపోతున్న పెన్నా పరీవాహక ప్రాంతాలు
- కట్టుబట్టలతో నెల్లూరులోని పునరావాస కేంద్రంల్లో 40 వేల మంది..
- కోవూరు పట్టణంలో ఇంకా ఇళ్ల మిద్దెలపైనే గడుపుతున్న ప్రజలు
- చిత్తూరు జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో 10 వేల మంది
- దక్షిణ అండమాన్ ప్రాంతంలోని ఆవర్తనం ప్రభావంతో ఆగని వర్షాలు
- 26 నుంచి డిసెంబర్ 2 వరకూ మళ్లీ భారీ వర్షాలు..!
- ఈసారీ నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురంపైనే తీవ్ర ప్రభావం
- పశ్చిమ వాయువ్య దిశగా కలుదుతున్న ఉపరితల ఆవర్తనంతో టెన్షన్
- దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇవాళ కూడా పలు రైళ్లు రద్దు
- నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు చర్యలు
- కడప జిల్లా నందలూరు-హస్తవరం మధ్య 500 మందితో రైల్వేట్రాక్ పనులు
- పెన్నా, పాపాగ్ని, చిత్రావతి నదుల ఉగ్రరూపంతో భారీగా ఆస్తినష్టం..!
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com