AP: శాసన మండలిలో "కుప్పం ఎమ్మెల్యే" దుమారం

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సూపర్ సిక్స్ హామీల అంశంపై స్వల్పకాలిక చర్చ ఉద్రిక్తతలకు దారి తీసింది. వైఎస్సార్సీపీ సభ్యుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు అధికార పక్ష మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీల ఆగ్రహానికి గురయ్యాయి. హామీల అమలును జీర్ణించుకోలేకే వైసీపీ నేతలు కడుపుమంటతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించిన వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రమేశ్ యాదవ్ పై చర్యలు కోరుతూ మంత్రులు కొల్లు రవీంద్ర, డోలా బాలవీరాంజనేయ స్వామి మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేశారు. జగన్ను పులివెందుల పులకేశి అంటే ఒప్పుకుంటారా అని మరో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. రమేష్ యాదవ్ వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రమేష్ యాదవ్ వ్యాఖ్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు వారికి హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com