బిగ్ బ్రేకింగ్.. ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
రేపటినుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్.

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రేపటినుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్. ఈ నెల 23 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. 23న తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ విడదల కానుంది. తొలిదశ పంచాయితీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరనున్నాయి. ఇక రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్.. ఈ నెల 27న విడుదల కానుంది. రెండో దశ పంచాయితి ఎన్నికలు ఫిబ్రవరి 9న జరగనున్నాయి. ఇక మూడ దశ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 31న, నాలుగో దశ నోటిపికేషన్ ఫిబ్రవరి 4న విడుదల కానుంది.
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. మళ్లీ ప్రొసీడింగ్స్‌ను ఎస్‌ఈసీ జారీ చేశారు. కరోనా వ్యాక్సిన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేమని అంటోందన్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకునే ముందు.. సుప్రీం ఆదేశాల మేరకు ప్రభుత్వంతో ఎస్‌ఈసీ సంప్రదింపులు జరిపిందని నిమ్మగడ్డ పేర్కొన్నారు. కరోనా, వ్యాక్సిన్ పరిస్థితులను ఎస్‌ఈసీ నిశితంగా గమనించిందని, ప్రభుత్వ పథకాలు ప్రారంభించే ముందు ఎస్‌ఈసీ అనుమతి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను.. ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన తప్పుబట్టారు. కరోనా సెకండ్ వేవ్ సాకుతో ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలంటోందని, రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని కొట్టిపారేశారు. భయానక పరిస్థితులున్న అమెరికాలోనే ఎన్నికలు జరిగాయని ఎస్‌ఈసీ రమేష్ గుర్తుచేశారు.