పంచాయతీ ఎన్నికల రద్దుపై నేడు హైకోర్టులో విచారణ

పంచాయతీ ఎన్నికల రద్దుపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు సింగిల్ బెంచ్ సస్పెండ్ చేయడంపై ఎన్నికల సంఘం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ కి ఇప్పటికే 4వేల మెయిల్స్ వచ్చాయని.. ఎన్నికల నిర్వహణ ఉంటుందా లేదా అని ప్రజల నుంచి మెయిల్స్ వచ్చాయని ఎస్ఈసీ తెలిపింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. నేటికి వాయిదా వేసింది.
SEC తరపున న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు విన్పించనున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఉత్తర్వులపై ఎన్నికల సంఘం అప్పీల్‌పై డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది. దీంతో డివిజన్ బెంచ్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com