మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ షాక్

మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ షాక్ ఇచ్చారు. మంత్రి కొడాలి నానిపై కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్ఈసీ ఆదేశించారు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధిగమించినందుకు కేసులు నమోదు చేయాలని సూచించారు. ఎసీఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై మంత్రి కొడాలి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి నిమ్మగడ్డ ఆదేశించారు.
శుక్రవారం కొడాలి నాని ప్రెస్‌మీట్‌లో నిమ్మగడ్డపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో నిమ్మగడ్డ మిలాఖత్ అయ్యారని ఆరోపించారు. వారంతా డ్రామా కంపెనీ ఆర్టిస్టులంటూ తీవ్ర పదజాలం వాడారు.
కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నిమ్మగడ్డ సీరియన్ అయ్యారు. సాయంత్రంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నాని ఇచ్చిన వివరణ పైన.. నిమ్మగడ్డ సంతృప్తి చెందలేదు. ఈనెల 21వ తేదీ వరకు కొడాలి నాని మీడియాతో మాట్లాడొద్దని నిమ్మగడ్డ ఆదేశించారు. అలాగే పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడకుండా కట్టడి చేశారు. ఈ మేరకు ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని కృష్ణా జిల్లా కలెక్టర్, సీపీతోపాటు రూరల్ ఎస్పీని నిమ్మగడ్డ ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com