AP: కొత్త ఏడాది నుంచి అమల్లోకి మదనపల్లి జిల్లా

AP: కొత్త ఏడాది నుంచి అమల్లోకి మదనపల్లి జిల్లా
X
కొత్త జిల్లాలో పాలనకు ముహూర్తం ఫిక్స్... జనవరి 1 నుంచి అమల్లోకి మదనపల్లి జిల్లా... కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభానికి సన్నాహాలు

కూ­ట­మి ప్ర­భు­త్వ ఆదే­శాల మే­ర­కు మద­న­ప­ల్లె జి­ల్లా ఏర్పా­టు­కు సం­బం­ధిం­చి సన్నా­హా­లు ప్రా­రం­భిం­చి­న­ట్లు కలె­క్ట­ర్‌ ని­శాం­త్‌­కు­మా­ర్‌ తె­లి­పా­రు. శని­వా­రం మద­న­ప­ల్లె జి­ల్లా ఏర్పా­టు సన్నా­హా­ల­కు సం­బం­ధిం­చి, ప్ర­భు­త్వ­శా­ఖల భవ­నాల కోసం సబ్‌ కలె­క్ట­ర్‌ చల్లా కల్యా­ణి, రె­వె­న్యూ సి­బ్బం­ది­తో కలి­సి ఆయన పట్ట­ణం­లో­ని బీటీ కళా­శాల, జీ­ఆ­ర్‌­టీ హై­స్కూ­ల్‌, జీ­ఎం­ఆ­ర్‌ పా­లి­టె­క్ని­క్‌, రే­స్‌ బీ­ఈ­డీ కా­లే­జ్‌ భవ­నా­ల­ను పరి­శీ­లిం­చా­రు. ఎక్క­డె­క్కడ ఏ కా­ర్యా­ల­యా­లు ఏర్పా­టు­చే­స్తే బా­గుం­టుం­ది. భవ­నాల వి­స్తీ­ర్ణం, అం­దు­బా­టు­లో­ని సౌ­క­ర్యా­లు, చే­యా­ల్సిన మర­మ్మ­తు­లు, పా­ర్కిం­గ్‌, ఇతర వస­తు­ల­పై చర్చిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా కలె­క్ట­ర్‌ ని­శాం­త్‌­కు­మా­ర్‌ మీ­డి­యా­తో మా­ట్లా­డు­తూ...నవం­బ­ర్‌ 27న రా­ష్ట్ర­ప్ర­భు­త్వం మద­న­ప­ల్లె జి­ల్లా ఏర్పా­టు­కు సం­బం­ధిం­చి నో­టి­ఫి­కే­ష­న్‌ వి­డు­దల చే­స్తూ అభ్యం­త­రా­లు తె­లి­పేం­దు­కు 30 రో­జుల గడు­వు ప్ర­క­టిం­చిం­ద­న్నా­రు. ప్ర­స్తు­తం అన్ని రం­గాల నుం­చి సూ­చ­న­లు, సల­హా­ల­ను స్వీ­క­రి­స్తు­న్నా­మ­న్నా­రు. ఈనె­లా­ఖ­రు­లో­పు కొ­త్త జి­ల్లా ఏర్పా­టు­పై పభు­త్వం ప్ర­క­టన చే­య­నుం­ద­న్నా­రు.తహ­సీ­ల్దా­ర్‌ కి­షో­ర్‌­కు­మా­ర్‌­రె­డ్డి, ఆర్‌ఐ బా­ల­సు­బ్ర­హ్మ­ణ్యం, మండల సర్వే­య­ర్‌ సు­బ్ర­హ్మ­ణ్యం,బీటీ కళా­శాల ఇన్‌­చా­ర్జి ప్రి­న్సి­పా­ల్‌ శైలజ పా­ల్గొ­న్నా­రు. కొ­త్త జి­ల్లా­ల­కు సం­బం­ధిం­చి ఇటీ­వ­లే ప్ర­భు­త్వం నో­టి­ఫి­కే­ష­న్ కూడా జారీ చే­సిం­ది.

అక్కడే జిల్లా కలెక్టరేట్..

కొ­త్త జి­ల్లా­లో పా­రి­పా­ల­న­కు సం­బం­ధిం­చి ఏర్పా­ట్లు చే­యా­ల­ని ప్ర­భు­త్వం నుం­చి స్ప­ష్ట­మైన సం­కే­తా­లు అం­ది­న­ట్లు సమా­చా­రం. దీం­తో ప్ర­భు­త్వ కా­ర్యా­ల­యా­లు ఎం­పిక చే­య­డం­పై కలె­క్ట­ర్‌ ని­షాం­త్‌ కు­మా­ర్‌ దృ­ష్టి సా­రిం­చా­రు. ఇప్ప­టి­కే మద­న­ప­ల్లె­లో ఉన్న సబ్‌ కలె­క్ట­ర్‌ కా­ర్యా­ల­యా­న్ని.. నూతన జి­ల్లా కలె­క్ట­ర్‌ కా­ర్యా­ల­యం­గా ఎం­పిక చే­యా­ల­ని భా­వి­స్తు­న్నా­రు. ఇటీ­వల ప్రా­రం­భిం­చిన డీ­ఎ­ల్‌­డీ­వో కా­ర్యా­ల­యం­లో.. సబ్‌ కలె­క్ట­ర్‌ కా­ర్యా­ల­యా­న్ని ఏర్పా­టు చే­యా­ల­ని యో­చి­స్తు­న్నా­రు. ఇక ఇతర వి­భా­గాల కా­ర్యా­ల­యాల కోసం కలె­క్ట­ర్‌­తో పాటు ఉన్న­తా­ధి­కా­రు­లు కస­ర­త్తు ము­మ్మ­రం చే­శా­రు. మద­న­ప­ల్లె­లో­ని బీటీ కా­లే­జీ­లో కొ­న్ని వి­భా­గా­ల­ను, జీ­ఎం­ఆ­ర్‌ పా­లి­టె­క్ని­క్‌ కళా­శా­ల­ను స్వా­ధీ­నం చే­సు­కు­ని ప్ర­భు­త్వ కా­ర్యా­ల­యా­ల­కు తా­త్కా­లి­కం­గా వి­ని­యో­గిం­చు­కో­వా­ల­ని అధి­కా­రు­లు భా­వి­స్తు­న్నా­రు. ఒక­వేళ ఇవి సరి­పో­క­పో­తే.. ప్రై­వే­టు భవ­నా­ల­ను అద్దె­కు తీ­సు­కు­నే అం­శా­న్ని కూడా పరి­శీ­లి­స్తు­న్నా­రు. జి­ల్లా కేం­ద్రం­లో పరి­పా­ల­న­కు సం­బం­ధిం­చి దా­దా­పు 60 వి­భా­గా­లుం­టా­యి. తా­త్కా­లిక కా­ర్యా­ల­యా­లు అవ­స­రం. అయి­తే అం­దు­లో 50 శాతం కా­ర్యా­ల­యా­ల­ను ప్ర­భు­త్వ భవ­నా­ల్లో­నే ఏర్పా­టు చే­యొ­చ్చ­నే అభి­ప్రా­యా­ని­కి వచ్చా­రు. మి­గ­తా కా­ర్యా­ల­యా­ల­ను.. ప్రై­వే­టు భవ­నా­ల్లో ఏర్పా­టు చే­యా­ల­ని చూ­స్తు­న్నా­రు.

Tags

Next Story