AP: ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలకు మహర్దశ

AP: ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలకు మహర్దశ
X
రూ.9,490 కోట్లతో 4 కీలక హైవేల విస్తరణ... 4 హైవేల విస్తరణకు డీపీఆర్ సిద్ధం... కేంద్ర ఆమోదం తర్వాత రోడ్ల విస్తరణ

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం రా­ష్ట్రం­లో రో­డ్ల అభి­వృ­ద్ది, వి­స్త­రణ, నూతన రహ­దా­రుల ని­ర్మా­ణం వంటి అం­శా­ల­పై దృ­ష్టి సా­రిం­చిం­ది. ఈ క్ర­మం­లో అధి­కా­రు­లు రా­ష్ట్రం­లో­ని నా­లు­గు కీలక హై­వేల వి­స్త­ర­ణ­కు డీ­పీ­ఆ­ర్ రెడీ చేసి కేం­ద్రా­ని­కి పం­పా­రు. పెడన- వి­స్స­న్న­పేట- లక్ష్మీ­పు­రం, ఆకి­వీ­డు-ది­గ­మ­ర్రు, అమ­లా­పు­రం-రా­వు­ల­పా­లెం, ము­ద్ద­నూ­రు-కడప మధ్య 243.3 కి.మీ.ల వి­స్త­ర­ణ­కు అధి­కా­రు­లు సమ­గ్ర ప్రా­జె­క్ట్‌ ని­వే­ది­క­లు సి­ద్ధం­చే­సి జా­తీయ రహ­దా­రుల మం­త్రి­త్వ­శాఖ(మో­ర్త్‌)కు పం­పా­రు. భూ­సే­క­రణ, సి­వి­ల్‌ పను­లు తది­త­రా­ల­న్నీ కలి­పి ఈ ప్రా­జె­క్టు­ల­కు రూ.9,490 కో­ట్ల వ్య­యం అవు­తుం­ద­ని అం­చ­నా. వచ్చే మా­ర్చి­లో­పు అను­మ­తు­లు రా­ను­న్న­ట్లు తె­లు­స్తోం­ది. అనం­త­రం భూ­సే­క­రణ, టెం­డ­ర్ల ప్ర­క్రియ మొ­ద­ల­వు­తా­యి. వచ్చే సం­వ­త్స­రం మా­ర్చి నా­టి­కి కేం­ద్రం దీ­న్ని ఆమో­ది­స్తుం­ద­ని.. ఆ తర్వాత భూ­సే­క­రణ, టెం­డ­ర్ల­కు ఆహ్వా­నం వంటి పను­లు ప్రా­రం­భం అవు­తా­య­ని భా­వి­స్తు­న్నా­రు.

రవాణ సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ

కేం­ద్ర, రా­ష్ట్ర ప్ర­భు­త్వా­లు మె­రు­గైన రవా­ణా సౌ­క­ర్యాల కల్ప­న­పై ప్ర­త్యేక శ్ర­ద్ధ పె­ట్టా­యి. పె­రు­గు­తు­న్న జనా­భా­ను దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని భవి­ష్య­త్తు అవ­స­రాల కోసం.. ఇప్ప­టి­కే ఉన్న రహ­దా­రు­ల­ను వి­స్త­రిం­చ­డం.. పలు ప్రాం­తా­ల్లో నూతన రో­డ్ల­ను ని­ర్మిం­చ­డం.. గ్రా­మీణ, పట్టణ ప్రాం­తాల రో­డ్ల­ను జా­తీయ రహ­దా­రు­ల­తో అను­సం­ధా­నిం­చ­డం వంటి చర్య­లు తీ­సు­కుం­టు­న్నా­యి. ఈక్ర­మం­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ప్ర­భు­త్వం రా­ష్ట్రం­లో­ని నా­లు­గు కీలక హై­వేల వి­స్త­ర­ణ­కు ఆమోద ము­ద్ర వే­సిం­ది. రూ.9,490 కో­ట్ల రూ­పా­యల ఖర్చు­తో ఈ నా­లు­గు కీలక హై­వే­ల­ను వి­స్త­రిం­చేం­దు­కు రంగం సి­ద్ధ­మ­య్యిం­ది. ఆ వి­వ­రా­లు.. జా­తీయ రహ­దా­రి-216హె­చ్‌ ఉన్న రూ­ట్‌ అనగా కృ­ష్ణా జి­ల్లా­లో­ని పెడన నుం­చి తె­లం­గాణ సరి­హ­ద్దు­లో­ని లక్ష్మీ­పు­రం వరకు.. గు­డి­వాడ, నూ­జి­వీ­డు, వి­స్స­న్న­పేట మీ­దు­గా మొ­త్తం 118 కిలో మీ­ట­ర్ల మేర రహ­దా­రి­ని వి­స్త­రిం­చ­ను­న్నా­రు. దీ­ని­కి సం­బం­ధిం­చి రూ.4,245 కో­ట్ల­తో డీ­పీ­ఆ­ర్‌­ను రెడీ చేసి కేం­ద్రా­ని­కి పం­పా­రు. ఈ హైవే వి­స్త­ర­ణ­లో భా­గం­గా పెడన-నూ­జి­వీ­డు బై­పా­స్‌ వరకు 4 వరు­స­లు­గా, అక్క­డి నుం­చి లక్ష్మీ­పు­రం దాకా 2 వరు­స­లు­గా రహ­దా­రి­ను వి­స్త­రిం­చ­ను­న్నా­రు. దీ­ని­కి సం­బం­ధిం­చి భూ­సే­క­ర­ణ­కు కా­వా­ల్సిన మొ­త్తం­తో పాటు ఇతర ఖర్చు­లు కా­కుం­డా.. కే­వ­లం సి­వి­ల్‌ పను­ల­కు మా­త్ర­మే రూ.2 వేల కో­ట్ల­ను వె­చ్చిం­చ­ను­న్నా­రు. అలా­నే పా­మ­ర్రు-ఆకి­వీ­డు వరకు ఇప్ప­టి­కే 60 కిలో మీ­ట­ర్ల రహ­దా­రి వి­స్త­రణ సా­గు­తు­న్నా­యి.

త్వరలోనే ఈ హైవేల విస్తరణ షురూ..

కృ­ష్ణా జి­ల్లా­లో­ని పెడన నుం­చి గు­డి­వాడ, నూ­జి­వీ­డు, వి­స్స­న్న­పేట మీ­దు­గా తె­లం­గాణ సరి­హ­ద్దు­లో­ని లక్ష్మీ­పు­రం వరకు జా­తీయ రహ­దా­రి-216హె­చ్‌­ను 118 కి.మీ. మేర వి­స్త­రిం­చ­ను­న్నా­రు. రూ.4,245 కో­ట్ల­తో డీ­పీ­ఆ­ర్‌­ను సి­ద్ధం­చే­సి పం­పా­రు. పెడన నుం­చి నూ­జి­వీ­డు బై­పా­స్‌ వరకు 4 వరు­స­లు­గా, అక్క­డి నుం­చి లక్ష్మీ­పు­రం దాకా రెం­డు వరు­స­లు­గా వి­స్త­రిం­చ­ను­న్నా­రు. భూ­సే­క­రణ వ్య­యం, ఇతర ఖర్చు­లు కా­కుం­డా సి­వి­ల్‌ పను­ల­కు రూ.2 వేల కో­ట్ల­ను వె­చ్చిం­చ­ను­న్నా­రు. పా­మ­ర్రు నుం­చి ఆకి­వీ­డు వరకు 60 కి.మీ. మేర ఇప్ప­టి­కే వి­స్త­రణ పను­లు సా­గు­తు­న్నా­యి. 45 కి.మీ. రెం­డు వరు­స­లు­గా, 15 కి.మీ. నా­లు­గు వరు­స­లు­గా వి­స్త­రి­స్తు­న్నా­రు. ఇప్పు­డు ఆకి­వీ­డు నుం­చి భీ­మ­వ­రం మీ­దు­గా ది­గ­మ­ర్రు వరకు 44.94 కి.మీ. వి­స్త­ర­ణ­కు డీ­పీ­ఆ­ర్‌ పం­పా­రు. ఇం­దు­లో 40 కి.మీ. 4 వరు­స­లు, మి­గి­లి­న­ది 2 వరు­స­లు­గా వి­స్త­రిం­చేం­దు­కు రూ.3,256 కో­ట్ల­తో అం­చ­నా­లు వే­శా­రు. వా­స్త­వా­ని­కి పా­మ­ర్రు నుం­చి ది­గ­మ­ర్రు వరకు (ఎన్‌­హె­చ్‌-165) మొ­త్తం ప్రా­జె­క్టు వి­స్త­రణ గతం­లో మం­జూ­రైం­ది.

Tags

Next Story