AP Minister : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

తిరుమల శ్రీవారిని ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ, దేవాదాయ శాఖకు సంబంధించిన అనేక విషయాలను చర్చించనున్నామని తెలిపారు. అనేక శాఖల్లో ఉండే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులు, అర్చకులు, రవాణా విభాగం వరకు టీటీడీలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఉద్యోగులకు న్యాయం చేరుకునేలా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. భక్తులకు ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. 161 ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల క్వాలిటీ, దర్శనాల విధివిధానాలను మెరుగుపరిచామన్నారు. ఆలయ ప్రాంగణాలలో దైవం స్మరణ మినహా మరే కార్యక్రమం నిర్వహించరాదని సీఎం ఆదేశించారని తెలిపారు. దేవాదాయ శాఖ నుంచి కామన్ గుడ్ ఫండ్ నుంచి 200 ఆలయాలకు పునఃనిర్మాణం కు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. దుపదీప నైవేద్యాలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com