Anitha : విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ మంత్రి అనిత

Anitha : విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ మంత్రి అనిత
X

శ్రీ గాయత్రీ దేవి అలంకృత అమ్మవారిని ఏపీ మంత్రి అనిత దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని.. భక్తులు సంతృప్తికరంగా అమ్మ దర్శనం చేసుకుంటున్నట్లు తెలిపారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ సామాన్య భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్ విషయం పైనా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. డ్రోన్ సాంకేతికతను కూడా క్షేత్రస్థాయిలో వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. కాగా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా రెండో రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్నారు.

Tags

Next Story