AP: పుస్తకాల భారం తగ్గించి నాణ్యత పెంచాలి: లోకేశ్

పాఠశాల విద్య స్థాయిలో బాలలకు పుస్తకాల భారం తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్యప్రణాళిక రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. 2025-26 విద్యాసంవత్సరంలో కెజి నుంచి పీజీ వరకు పాఠ్యప్రణాళిక సమూల ప్రక్షాళనపై మంత్రి ఉండవల్లి నివాసంలో సమీక్షించారు. ఇంటర్ ప్రిఫైనల్ ఎగ్జామ్స్ ను జనవరి కల్లా పూర్తిచేసేలా క్యాలండర్ రూపొందించాలన్నారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలు చేపట్టాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీల్లో క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లక్ష్యంగా క్రెడిట్ ఫ్రేమ్ వర్క్, ఇంటర్న్ షిప్‌లు ఉండాలని చెప్పారు. యూనివర్సిటీల వీసీల నియామకంలో అకడమిక్ ఎచీవ్‌మెంట్స్, కరిక్యులమ్ డెవలప్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ స్ట్రాటజీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పాటయ్యే అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యుల ఎంపికలో విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్టేక్ హోల్డర్లు, పాలసీ ఎక్స్ పర్ట్స్, రీసెర్చ్ నిపుణులకు స్థానం కల్పించాలని మంత్రి లోకేష్ తెలిపారు.
పాలిటెక్నిక్ శిక్షణలో మార్పులు తెస్తాం: ఏపీ
మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు అనుగుణంగా పాలిటెక్నిక్ శిక్షణలో మార్పులు తెస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పాలిటెక్ ఫెస్ట్-2018 చంద్రబాబు ఆలోచనల్లో నుంచి వచ్చిన కార్యక్రమమని అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో విద్యార్థుల ప్రతిభ అపారమని లోకేశ్ కొనియాడారు. ఏపీ ప్రభుత్వ శాఖల్లో పైలట్ ప్రాజెక్టులు చేసేలా విద్యార్థుల కోసం ప్రత్యేక జీవో తెస్తామని నారా లోకేశ్ వెల్లడించారు.
అమరావతిపై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ అంతటా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అమరావతే రాజధానిగా ఉంటూ అభివృద్ధి మాత్రం రాష్ట్రం మెుత్తం చేయాలన్నదే కూటమి ప్రభుత్వ విధానమని తెలిపారు. పాలిటెక్ ఫెస్ట్ 2024-25లో పాల్గొన్న లోకేశ్.. అనంతపురం ఆటోమొబైల్ హబ్ గానూ, కర్నూల్ డ్రోన్ హబ్‌గా, కడప, చిత్తూరు జిల్లాలను ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్షరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com