AP: ఐసీసీ ఛైర్మన్‌తో నారా లోకేశ్ భేటీ

AP: ఐసీసీ ఛైర్మన్‌తో నారా లోకేశ్ భేటీ
X

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్... ఐసీసీ ఛైర్మన్ జై షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధిపై జైషాతో నారా లోకేశ్ కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌- భారత్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌ను తనయుడు నారా దేవాంశ్‌తో కలిసి లోకేశ్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఐసీసీ ఛైర్మన్‌ జైషాతో లోకేశ్‌ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై జైషాతో చర్చించినట్టు నారా లోకేశ్ వెల్లడించారు. లోకేశ్‌తో పాటు ఏపీ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేశినేని చిన్ని, ఉపాధ్యక్షుడు సానా సతీశ్‌, దర్శకుడు సుకుమార్‌ కలిసున్న ఫొటోలు... సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

చిరంజీవి సందడి

భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ను మెగాస్టార్ చిరంజీవి పెవిలియన్‌లో కూర్చుని భారత క్రికెటర్లు తిలక్ వర్మ, అభిషేక్‌లతో కలిసి మ్యాచ్ చూశారు. చిరు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది.

Tags

Next Story