Lokesh: చిన్నారి ప్రాణాలు కాపాడిన నారా లోకేశ్

Lokesh: చిన్నారి ప్రాణాలు కాపాడిన నారా లోకేశ్
X
కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పిన తల్లిదండ్రులు.. నెట్టింట ప్రశంసల వర్షం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన మంచి మనసును చాటుకున్నారు. ప్లేట్‌లెట్లు పడిపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన 14 రోజుల పసికందుకు అండగా నిలిచి ప్రాణం నిలబెట్టాడు. చిన్నారిని విజయవాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే భారీ ఖర్చుతో వైద్యం చేయించలేని స్థితిలో పడిపోయారు. కన్నబిడ్డకు మృత్యువు ముంచుకొస్తున్న వేళ నారా లోకేశ్ స్పందించారు. మంత్రి నారా లోకేశ్‌ క్షణాల్లో స్పందించి.. బిడ్డను ప్రాణాలు నిలిచేలా చేశారు.

ఇంతకీ ఏమైందంటే...

జగ్గయ్యపేటలోని సత్యనారాయణపురానికి చెందిన గిరిజన కుటుంబానికి చెందిన ప్రైవేటు చిరుద్యోగి చదల మహేశ్‌ తన బిడ్డ ప్రాణాలను మంత్రి లోకేశ్‌ నిలిపిన వైనాన్ని వివరించారు. మహేష్‌ భార్య లక్ష్మీ సెప్టెంబరు 14న రెండో సంతానంగా మగ శిశువును ప్రసవించింది. బిడ్డ 4 కేజీల బరువుతో ఆరోగ్యంగా జన్మించాడు. అయితే త ర్వాత 14 రోజులకు బాబు రాత్రిళ్లు ఏడుస్తూ ఉండటం, పాలు తాగకపోవటంతో పట్టణంలో ఒక చిన్నపిల్లల ఆస్పత్రికి, తర్వాత మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా రక్తకణాలు పడిపోయాయని వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తీసుకెళ్లాలని సూచించారు.విజయవాడ ఆంధ్రా ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని, చికిత్సకు భారీగా ఖర్చవుతుందని అక్కడి డాక్టర్లు చెప్పారు. అయితే అంత డబ్బు లేని నేపథ్యంలో న్యాయవాది, స్నేహితుడు మహేంద్ర ఇచ్చిన సూచనతో బాలుడి తండ్రి మహేశ్‌ గత నెల 27 అర్ధరాత్రి ఉండవల్లిలోని నారా లోకేష్‌ నివాసం వద్దకు వెళ్లాడు. అప్పటికే ప్రజాదర్బార్‌కు 400 మంది తమ అర్జీలతో సిద్ధంగా ఉన్నారు. అప్పుడు శిశువుకు ప్లేట్‌లెట్స్‌ మరింత తగ్గాయని ఆస్పత్రి నుంచి ఫోన్‌ రావటంలో తీవ్ర ఆందోళన చెందిన మహేశ్‌.. 5 నిమిషాల్లో తన బిడ్డ చనిపోతాడంటూ పరిస్థితిని మిగతా అర్జీదారులకు, భద్రతా సిబ్బందికి వివరించాడు. ఆ తర్వాత లోకేశ్‌ ఓఎస్డీని , అక్కడ నుంచి మంత్రి లోకే్‌శ్ ను కలవడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఆయన మొర విన్న మంత్రి లోకేశ్‌.. ఎంత ఖర్చైనా ఆ పసికందుకు చికిత్స చేయించమని కలెక్టర్‌, పీఎ్‌సకు ఆదేశాలు ఇచ్చారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించడంతో బాబు ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని ఆంధ్రజ్యోతికి చెప్పారు.

రాజేంద్రప్రసాద్ కుమార్తె మరణంపై సంతాపం

సినీనటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ స్పందించారు.‘‘సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి చిన్న వయసులోనే అకాల మరణానికి గురికావడం అత్యంత దురదృష్టకరం. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నాను’’ అని చంద్రబాబు సంతాపం తెలియజేయగా.. ‘‘నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి మృతి బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అంటూ నారా లోకేశ్ తన సానుభూతి ప్రకటించారు.

Tags

Next Story