NARAYANA: ఏపీలో మళ్లీ " పోస్టర్ ఫ్రీ సిటీ"

NARAYANA: ఏపీలో మళ్లీ  పోస్టర్ ఫ్రీ సిటీ
X
అన్ని పట్టణాలను పోస్టర్లు, ఫ్లెక్సీలు లేకుండా అందంగా మారుస్తామన్న నారాయణ.. తన ఫ్లెక్సీలను తొలగించిన మంత్రి

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పట్టణాలను పోస్టర్లు, ఫ్లెక్సీలు లేకుండా అందంగా మారుస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ పిల్లర్లకు అంటించిన పోస్టర్లను ఆయన తొలగించారు. గతంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం 90 శాతం విజయవంతమైంది అని తెలిపారు. ఆ స్ఫూర్తితోనే మళ్లీ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని... నెల్లూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా మారుస్తామన్నారు. ఫ్లెక్సీలను కూడా అనుమతించబోమని... రాజకీయ పార్టీల సమావేశాలు ఉన్నపుడు 48 గంటలు మాత్రమే పోస్టర్లకు అనుమతినిస్తామని తెలిపారు. 2014-19ల మధ్య అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచనల మేరకు నెల్లూరులో పోస్టర్స్, ఫ్లెక్సీలను తొలగించామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.

వారంలో తొలగించండి..

వారంలోగా నెల్లూరు నగరంలో ఉన్న పోస్టర్లను తొలగించాలని అధికారులకు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాలు ఎంతో ప్రభావితం చేస్తున్నాయని... వాటిల్లో ప్రకటనలు ఇచ్చుకోవాలని సూచిస్తున్నామన్నారు. తన ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా నారాయణ తొలగించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. వీటితో పాటు ఆపరేషన్ బుడమేరు తరహలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో.. కాల్వల్లో అక్రమ కట్టడాలు తొలగిస్తామన్నారు. నెల్లూరులోని ప్రధాన కాల్వల స్థితిగతులపై.. సర్వే చేపట్టాం.. కాలువలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను తొలగించేందుకు రెడీగా ఉండాలి.. భవిష్యత్ ప్రయోజనాలు, గత చేదు అనుభవాల దృష్ట్యా వ్యూహాత్మక చర్యలు చేపట్టామని మంత్రి నారాయణ సూచించారు.

బుడమేరు ఆక్రమణలే ముంచాయి

బుడమేరు ఆక్రమణలే విజయవాడను ముంచేశాయని మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుడమేరు వరదల వల్ల లక్షల మంది ఇబ్బందులు పడ్డారని అన్నారు. అలాంటి కష్టం ఎవరికీ రాకూడదని పేర్కొన్నారు. 2015 ప్రాంతంలో వరదలతో నెల్లూరునగరం మునిగిన ఆయన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నెల్లూరు నగరాభివృద్ధికి పకగడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఆ విషయంపై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా త్వరలోనే కాలువల వెడెల్పు పనులు చేపడుతామని మంత్రి నారాయణ తెలిపారు.

Tags

Next Story