Perni Nani : పవన్‌ది పూటకో సిద్ధాంతం...రోజుకో రాద్ధాంతం: పేర్ని నాని

X
Perni Nani : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పేర్ని నాని. చిరంజీవి లేకపోతే పవన్ ఎక్కడుండే వారు అని ప్రశ్నించారు. 2014 నుంచి పవన్‌కల్యాణ్ ఏపీ కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిసి ఉద్ధానాన్ని ఏం ఉద్ధరించారన్నారు.
పవన్‌ది పూటకో సిద్ధాంతం..రోజుకో రాద్ధాంతం అన్నారు పేర్ని నాని. 2014 నుంచి 19 వరకు పవన్ ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం కేంద్రాన్ని ప్రశ్నించారా...అని అడిగారు నాని.
పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు చెప్పారంటూ మండిపడ్డారు. చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తేవడమే పవన్ కల్యాణ్ లక్ష్యమన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ ఊసరవెళ్లి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
