AP: నామినేషన్లు దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు

AP: నామినేషన్లు దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు
X

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీడీపీ నేతలు బీటీ నాయుడు, బీద రవిచంద్రయాదవ్‌, కావలి గ్రీష్మ నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈసారి మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా, ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీయేకు అన్ని స్థానాలూ గెలుచుకునే అవకాశముంది. వెనుకబడిన వర్గాలకు చెందిన బీటీ నాయుడు, బీద రవిచంద్రయాదవ్‌.. ఎస్సీ సామాజికవర్గం కావలి గ్రీష్మకు తెదేపా అవకాశం కల్పించింది. జనసేన నుంచి నాగబాబు ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు నామపత్రాలు దాఖలు చేశారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. సంఖ్యాబలం దృష్ట్యా.. వీరి గెలుపు లాంఛనం కానుంది. మండలిలో భాజపాకి ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించినందుకు కమలం నేతలు.. చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Next Story