తిరుపతిలో దొంగ ఓట్లు వేసేందుకు చెవిరెడ్డి సోదరుడు ప్రయత్నించారు: చంద్రబాబు

Nara chandrababu Naidu (File Photo)
ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ఓటర్లు ప్రజాస్వామ్య రక్షకులు అని తెలిపారు. స్వేచ్ఛగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని అన్నారు. వైసీసీ దాష్టీకాలకు ఎస్ఈసీ అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు కోరారు.
అటు.. గుంటూరు, విజయవాడ, విశాఖ, తిరుపతిలో వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ సానుభూతిపరులపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.విజయవాడ, 8వ డివిజన్‌లో టీడీపీ నేతలపై దాడి చేశారని చంద్రబాబు తెలిపారు. ఆళ్లగడ్డలో కాలేజీ సిబ్బందిని రిటర్నింగ్ అధికారులుగా నియమించారని చెప్పారు. తిరుపతిలో దొంగ ఓట్లు వేసేందుకు చెవిరెడ్డి సోదరుడు ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ గూండాలు పోలింగ్ కేంద్రాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. పోలింగ్ శాతం పెరగకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com