జగన్ పిరికివాడు కాబట్టే.. ప్రత్యేక హోదా వదిలేశారు : నారా లోకేష్

జగన్ పిరికివాడు కాబట్టే.. ప్రత్యేక హోదా వదిలేశారు : నారా లోకేష్
మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2021ని నారా లోకేష్ విడుదల చేశారు

ముఖ్యమంత్రి జగన్ పిరికివాడు కాబట్టే.. ప్రత్యేక హోదా వదిలేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2021ని విడుదల చేసిన నారా లోకేష్.. స్టీల్ ప్లాంట్‌ను వైసీపీ ప్రభుత్వం వదిలేసిందని మండిపడ్డారు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కమిటీలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సభ్యుడని.. ఇక వైసీపీ ప్రభుత్వం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా ఎలా అడ్డుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.

మరోవైపు మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2021ని నారా లోకేష్ విడుదల చేశారు. పురపాలనకు పంచ సూత్రాలు పేరిట.. 10అంశాలతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత కోసం ప్రతీ 6 నెలలకొకసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు 21వేలకు పెంచుతామన్నారు నారా లోకేష్.

Tags

Read MoreRead Less
Next Story