మున్సిపల్ ఎన్నికల పోలింగ్..10 శాతానికి మించని ఓటింగ్ శాతం

మున్సిపల్ ఎన్నికల పోలింగ్..10 శాతానికి మించని ఓటింగ్ శాతం
ఇంత వరకూ వస్తున్న సమాచారం బట్టి చూస్తే తొలి రెండున్నర గంటల్లో 10-12 మాత్రమే పోలింగ్ నమోదైంది

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం కాస్త మందకొడిగానే ఓటింగ్ ప్రారంభమైనా తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. తీవ్రమైన ఉత్కంఠ రేపిన ఈ పుర సమరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చూసేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

SEC నిమ్మగడ్డ రమేష్‌కుమార్ విజయవాడలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిస్థితులు పరిశీలించారు. ఓటర్లతోనూ మాట్లాడారు. ఓటరు స్లిప్పు లేకపోయినా సరైన గుర్తింపు పత్రం చూపించి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.

ఇక.. ఇంత వరకూ వస్తున్న సమాచారం బట్టి చూస్తే తొలి రెండున్నర గంటల్లో 10-12 మాత్రమే పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్ల పరిధిలో కంటే మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఓటర్ల క్యూలైన్లు ఎక్కువ కనిపించాయి. కర్నూలు

కడప జిల్లా ప్రొద్దుటూరులోను, మరోచోట స్వల్ప ఘర్షణలే తప్ప రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌కి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జరుగుతోంది. ప్రొద్దుటూరులో మహిళా ఓటర్లకు ముక్కుపుడకలు పంచుతున్న వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు, కొన్ని చోట్ల ఓటర్ల జాబితాలో గందరగోళ పరిస్థితుల కారణంగా బూత్‌లకు చేరుకునేందుకు ఓటర్లు ఇబ్బంది పడ్డారు.

గుంటూరు కార్పొరేషన్‌లోనే తీసుకుంటే ఒకే కుటుంబంలో ఉన్న ముగ్గురి ఓట్లు 3 వేర్వేరు డివిజన్లలో ఉన్నాయి. ఇలాంటి పరిణామాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక కర్నూలు జిల్లా డోన్ మున్సిపాలిటీలో ఐతే అసలు ఎన్నికల సందడే కనిపించడం లేదు. అక్కడ 32 వార్డులకు గాను 25 ఏకగ్రీవం అయిపోయాయి. మిగతా 7 వార్డులకు చాలా మందకొడిగా పోలింగ్ జరుగుతోంది. రాయలసీమ ఐజీ వెంకట్రామిరెడ్డి పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని పరిశీలించారు.


Tags

Next Story