AP New Districts : ఏపీలో త్వరలోనే కొత్తజిల్లాల ఏర్పాటు..!

AP New Districts : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తజిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ ఇచ్చింది. ఎట్టకేలకు హామీని నెరవేర్చే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలుంటే.. 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేదిశగా ప్రక్రియ ప్రారంభమైనట్టు స్పష్టమవుతోంది.
అరకు పార్లమెంట్ సెగ్మెంట్ భౌగోళిక రిత్యా చాలా విస్తారమైనది కావడంతో.. ఆ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై స్థానిక వైసీపీ నేతల అభిప్రాయాలు, అధికారుల నివేదికలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం. గతంలో కొత్త జిల్లాలపై ఏర్పాటు చేసిన స్టేట్ లెవెల్ కమిటీ, సబ్ కమిటీలు, డిస్ట్రిక్ సబ్ కమిటీల సూచనలను కూడా తీసుకుంది.
అంతా ఓకే అనుకున్నాకే.. ఫైనల్ గా 26 జిల్లాలు ఉండేలా కసరత్తు చేసినట్లు సమాచారం. పెరిగిన జనాభాకు అనుగుణంగా పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలంటే..ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్తజిల్లాల ఏర్పాటు అవసరమని ఇంతకు ముందే వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఈ ప్రక్రియకు అన్ని విధాలుగా సిద్ధమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com