AP: ఏపీలో నేటి నుంచే నూతన మద్యం విధానం

ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీ నేటి నుంచి అమల్లోకి రానుంది. ప్రతి మద్యం దుకాణంలోనూ డిజిటల్ పేమెంట్స్ జరిగేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్లకు గండిపడగా.. కూటమి ప్రభుత్వం మాత్రం డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి తెస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిజిటర్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. జూన్ నుంచి ప్రతినెలా 9 శాతం పెరిగాయి. డిజిటల్ పేమెంట్ పద్దతిని అవలంభించడం ద్వారా మద్యం అమ్మకాల్లో పారదర్శకత పెరిగింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం లభించనుంది.
నాణ్యమైన మద్యం సరఫరా
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని లిక్కర్ షాపుల్లోనూ నాణ్యమైన మద్యాన్ని సరఫరా జరిగేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరోవైపు మద్యం టెండర్ల ప్రక్రియ, లాటరీ ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. ప్రతి మద్యం దుకాణంలోనూ ఆన్‌లైన్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. లాటరీ ప్రక్రియ విజయవంతం అయ్యింది. టెండర్ల కోసం విదేశాల నుంచి దరఖాస్తులు పోటెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలకు గాను 89882 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలు ఉండగా అందులో 10 శాతం అంటే 345 దుకాణాలను కేవలం మహిళలే దక్కించుకున్నారు. అప్లికేషన్ల ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.1,798 కోట్ల ఆదాయం వచ్చింది. "దరఖాస్తుల స్వీకరణ, మద్యం షాపుల కేటాయింపు సజావుగా జరిగింది. ఇకపై ఏపీలో మద్యం విక్రయాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని కూటమి ప్రభుత్వం తెలిపింది.
ఏపీలో మద్యం విక్రయాల టైమింగ్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే మద్యం దుకాణాల కేటాయింపు పూర్తికాగా... దక్కించుకున్న వారు షాపులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాల్లో విక్రయాలు జరగనున్నాయి. డిజిటల్ పేమెంట్ విధానాన్ని కూడా ప్రభుత్వం తీసుకురానుంది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని యజమానులకు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.
మందుబాబులకు ఏపీ సర్కార్ షాక్
ఏపీలో మందుబాబులకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మద్యం అమ్మకాలపై కాకుండా అదనంగా 2 శాతం డ్రగ్స్ నియంత్రణ సెస్ విధిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ. 1500 కోట్లు ఆదాయం వచ్చింది. మొత్తం ఏపీలోని 26 జిల్లాలో 3396 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించారు. మద్యం దుకాణాల లైసెన్సులు దక్కించుకున్న వారిని బెదిరిస్తున్నారన్న నేతలను చంద్రబాబు హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com