Open School Admissions : ఏపీ ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

Open School Admissions : ఏపీ ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
X

పలు కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారికి మరో అవకాశం కల్పిస్తోంది ఏపీ సర్కార్. 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు సార్వత్రిక విద్యా పీఠం దరఖాస్తులు కోరుతోంది. జులై 31 నుంచి ఆగస్టు 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యా పీఠం డైరెక్టర్ నాగేశ్వరరావు ఓ ప్రటకనలో తెలిపారు.

రూ.200 అపరాధ రుసుముతో ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు.

"తెలంగాణ డీఈఈ సెట్ 2024లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ధ్రువపత్రాల పరిశీలన తేదీలు విడుదలయ్యాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తాం" అని కన్వీనర్ శ్రీనివాసాచారి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

Tags

Next Story