13 Feb 2021 6:30 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / వైసీపీలో తారాస్థాయికి...

వైసీపీలో తారాస్థాయికి విబేధాలు.. సీఎం జగన్‌కి అంజయ్య దంపతులు సెల్ఫీ వీడియో

ఎమ్మెల్యే మద్దతుతోనే తమ కుటుంబంపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని మార్కెట్ యార్డు చైర్మన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీలో తారాస్థాయికి విబేధాలు.. సీఎం జగన్‌కి అంజయ్య దంపతులు సెల్ఫీ వీడియో
X

గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీలో విబేధాలు బయటపడ్డాయి. పంచాయతీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు గురిచేస్తున్నారని సీఎం జగన్‌కి రొంపిచర్ల మార్కెట్ యార్డు చైర్మన్ దాపులూరి అంజయ్య దంపతులు సెల్ఫీ వీడియోలో మొరపెట్టుకున్నారు.

కనీసం ఏజెంట్లుగా కూర్చున్నా ఒప్పుకునేది లేదని.. తుపాకీతో బెదిరింపులకు గుర్తిచేస్తున్నారని.. నరసరావుపేట టూ టౌన్ సీఐ కృష్ణయ్య నుంచి తమను కాపాడాలంటూ వేడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మద్దతుతోనే తమ కుటుంబంపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని రొంపిచర్ల మార్కెట్ యార్డు చైర్మన్ దాపులూరి అంజయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Next Story