ఏపీలో కొనసాగుతోన్న రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

ఏపీలో కొనసాగుతోన్న రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
ఇప్పటికే 539 సర్పంచ్ స్థానాలు, 12 వేల 605 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 13 జిల్లాల్లో 3వేల 328 గ్రామ పంచాయతీలు, 33 వేల 570 వార్డు సభ్యుల స్థానాలకు రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటికే 539 సర్పంచ్ స్థానాలు, 12 వేల 605 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 2 వేలా 786 పంచాయతీలు, 20 వేల 796 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. సర్పంచ్ పదవి కోసం 7 వేలా 510 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు. ఎక్కడా అవంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 48 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్‌ ఎన్నిక జరుగుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా 29వేల 304 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 వరకే పోలింగ్‌ ముగియనుంది. కరోనా సోకిన వారు చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ను పరిశీలించనున్నారు అధికారులు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పరిస్థితిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పరిశీలిస్తారు.


Tags

Read MoreRead Less
Next Story