AP: ఇక వాట్సప్‌లోనే సర్టిఫికెట్లు
సగానికిపైగా ప్రభత్వ సేవల్ని వాట్సాప్ ద్వారా పొందే ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం చేయబోతోంది. ఇందుకోసం.. మెటాతో ఏపీ ప్రభుత్వం తాజాగా ఒప్పందం చేసుకుంది. కులం సర్టిఫికెట్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇక వాట్సాప్‌లోనే వచ్చేస్తుంది. ప్రభుత్వానికి వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు సహా ఛార్జీలను ఇక వాట్సాప్‌లోనే చెల్లించే అవకాశం రానుంది. ధ్రువపత్రాల సమస్యను పరిష్కరిస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చిన లోకేశ్.. ఆ సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. మెటాతో కలిసి ప్రజలకు సేవలందించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. ఈ మేరకు మెటాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ మెటా సంస్థ ప్రతినిధులు ఢిల్లీలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మంత్రి నారా లోకేశ్ చొరవతో ప్రజలకు ప్రభుత్వం నుంచి పౌరసేవలు వాట్సాప్ బిజినెస్ ద్వారా అందించేందుకు మెటా అంగీకరించింది. మెటా ఫ్లాట్ ఫాం వాట్సాప్ బిజినెస్ ద్వారా ఇకపై క్యాస్ట్, ఇతరత్రా సర్టిఫికెట్లు వేగంగా, సులభంగా పొందేందుకు వీలవుతుంది. అలాగే నకిలీలు, ట్యాంపరింగ్ అవకాశం లేకుండా పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్ల జారీ ఉంటుంది.
నారా లోకేశ్ సమక్షంలో ఒప్పందం..
మెటా నుంచి కన్సల్టేషన్ టెక్నికల్ సపోర్ట్, ఈ గవర్నెన్స్ అమలు, కృత్రిమ మేధ ద్వారా మరిన్ని పౌర సేవలు ఏపీ ప్రభుత్వానికి అందించేలా మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూ చేసుకున్నారు. టెక్నికల్ సపోర్ట్, ఈ గవర్నెన్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా మరిన్ని సిటిజెన్ సర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి మెటా అందించనుంది. ఈ విషయాన్ని నారా లోకేష్ తన సోషల్ మీడియా వేదికైన 'ఎక్స్(X)'లో తెలిపారు. మెటాతో ఎంవోయూ ఒక చారిత్రాత్మకమైన మైలురాయి అని మంత్రి లోకేశ్ అభివర్ణించారు. త్వరలోనే మెటా టెక్నాలజీ ద్వారా పౌర సేవలను ప్రజలకు ఒక్క క్లిక్ ద్వారా సమర్ధవంతంగా అందజేస్తామని ట్వీట్ చేశారు.
మరిన్ని సేవలు
ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ప్రపంచమంతా విస్తరించిన మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. లోకేశ్ చొరవతో వాట్సప్ బిజినెస్ ద్వారా ప్రజలకు పౌరసేవలను అందించేందుకు మెటా అంగీకరించింది. మెటా ఫ్లాట్‌ఫాం వాట్సప్ బిజినెస్ ద్వారా ఇకపై క్యాస్ట్, ఇతరత్రా సర్టిఫికెట్లు వేగంగా, సులభంగా పొందేందుకు వీలు అవుతుంది. అలాగే నకిలీలు, ట్యాంపరింగ్ అవకాశం లేకుండా పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్ల జారీ ఉంటుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com