AP Petrol Price: మిగతా రాష్ట్రాలకు షాక్ ఇచ్చేలా ఏపీలో డీజిల్ రేట్లు..

AP Petrol Price (tv5news.in)
AP Petrol Price: తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఆకాశాన్నంటున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే.. ఒక్క ఏపీలోనే డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. పెట్రోల్ ధరలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా.. డీజిల్ రేటు మాత్రం అత్యధికంగా ఏపీలోనే ఉంది. విజయవాడలో లీటరు డీజిల్ 96 రూపాయల 14 పైసలుగా ఉంది. ఏపీలో డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌తో పాటు లీటరుకు 4 రూపాయల అదనపు వ్యాట్, రోడ్డు అభివృద్ధి సెస్ రూపంలో రూపాయి చొప్పున పన్నులు విధిస్తున్నారు. ఏపీతో పోలిస్తే.. డీజిల్ రేటులో పన్ను వ్యత్యాసం కారణంగా మిగిలిన రాష్ట్రాల్లో తక్కువగానే ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. విపక్షాలు సైతం ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. రాష్ట్రంలో పెట్రో ధరలు తగ్గించాల్సిందేనని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆందోళనలు చేపట్టనుంది. ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టనున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. పెట్రోల్ బంకుల వద్ద ఆందోళనలు చేపట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తానని చెప్పిన జగన్... మాట తప్పారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీపై జగన్ ఏం సమాధానం చెప్తారని సూటిగా ప్రశ్నించారు. అధికారం చేతులో ఉందని ధరలతో ప్రజలను బాదుతారా అని నిలదీశారు. ధరలు పెరగడం వల్ల రైతులు అప్పులపాలు అవుతున్నారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com